భానుడు రోజు రోజుకు విశ్వరూపం చూపిస్తున్నాడు. మండే ఎండలను తట్టుకునేందుకు ప్రజలు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. నేడు మారిన జీవనశైలిలో భాగంగా వాహనాల పట్ల కూడా కాస్త జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవి వచ్చిందంటే వాహనదారులు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా పార్కింగ్ లేకపోవడంతో ఎండలోనే వాహనాలు ఉంచడం ద్వారా రంగు వెలిసిపోతాయి. ఇంజన్ నుంచి పొగలు రావడం, పెట్రోల్ ఆవిరైపోవడం, టైర్ పంక్చర్ కావడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
ఇంజన్ ఆయిల్ మార్పిడిలో అప్రమత్తం ..
వేసవిలో వాహనాల ఇంజన్ ఆయిల్ మార్పిడి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వేడి కారణంగా ఇంజన్ ఆయిల్ ఆవిరయ్యే అవకాశం ఉంది. వాహనాలు నడుపుతున్నప్పుడు వచ్చే వేడి .. ఎండ వేడి కలిసి ఇంజన్ ఓవర్‌హీట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇంజన్ నుంచి పొగలు వస్తుంటాయి. దీంతో పాటు ఎయిర్ లాక్ ఏర్పడి వాహనం స్టార్ట్ కాక మొరాయించే అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఇంజన్ ఆయిల్‌ను ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఇబ్బందులు తప్పుతాయి. సాధారణంగా 2వేల కి.మీలకు ఒకసారి మార్చే ఇంజన్ ఆయిల్‌ను వేసవిలో 1,000 నుంచి 1,500 కిలో మీటర్లకు మార్చుకోవడం మంచిది.
రక్షణ నిచ్చే సీట్ కవర్లు.. క్లాత్ కవర్లు
ఎండ తీవ్రతను తగ్గించడంలో సీట్ కవర్లది ప్రముఖ పాత్ర ఉంటుంది. కేవలం సీటుకే కాకుండా పెట్రోల్ ట్యాంక్‌కు కూడా కవర్‌లు వేయడం మరింత సురక్షితం. వేడిని తగ్గించే వెల్‌వెట్, పోస్ట్‌క్లాత్ వంటి సీట్ కవర్లు వేయిస్తే మంచిది.
వాకడం విషయంలో జాగ్రత్తలు
వేసవిలో ద్విచక్ర వాహనాలను అవసరం ఉంటే తప్ప అదేపనిగా వినియోగించకుండా ఉంటే మంచిది. దూర ప్రాంతాలకు వాహనా ల్లో ప్రయాణం చేసే వారు ద్విచక్ర వాహనాన్ని పక్కన పెట్టి బస్సులో ప్రయాణిస్తే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిన మార్గమధ్యంలో కాస్త చల్లటి ప్రదేశాల్లో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా వాహనం ఇంజన్ కండిషన్‌లో ఉంటుంది.
పార్కింగ్ ముఖ్యం..
వాహనాలను ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ముఖ్యంగా స్థల సేకరణ అవసరం. పార్కింగ్ స్థలాలు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణాల వద్ద పార్కింగ్ చేస్తుండడంతో పాటు ఎటువంటి నీడలేని రహదారుల పైనే పార్కింగ్ వచేయాల్సి వస్తుంది. దీంతో ఎండ అధికంగా ఉండే సమయంలో వాహనాల్లోని పెట్రోల్ ఆవిరైపోతుంది. రాత్రి వేళల్లో ఒకసారి ట్యాంక్ మూతను తీసి మళ్లీ పెట్టడం ద్వారా వేడికారణంగా ట్యాంక్‌లో ఏర్పడ్డ గ్యాస్ బయటకు వెళ్లి ఇంజన్‌లోకి ఆయిల్ సులువుగా వెళ్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
వేసవిలో వాహనాలపై జాగ్రత్త అవసరం
వేసవిలో వాహనాలపై జాగ్రత్త అవసరం. వీలైనంత మేరకు వాహనాలను నీడలోనే పార్కింగ్ చేసేందుకు ప్రయత్నం చేయాలి. వాహనాలను ఎండ నుంచి కాపాడేందుకు క్లాత్ కవర్లు ఉపయోగపడతాయి. ఇక ఇంజన్ ఆయిల్‌ను మిగతా సమయంలో కంటే వే సవిలో కాస్త ముందుగానే మార్చుకుంటే మంచిది.
http://www.sakshi.com/news/andhra-pradesh/this-is-to-protect-vehicles-from-the-sun-331695