7, మార్చి 2016, సోమవారం

వైఎస్‌ శిక్ష తప్పించుకున్నారు: బాబు

సీఎంగా ఉన్నప్పుడు ఇడుపులపాయ అసైన్డ్ భూములపై అసెంబ్లీలో జరిగిన చర్చను చంద్రబాబు గుర్తు చేశారు. ావైఎస్ కుటుంబం ఇడుపులపాయలో 610 ఎకరాల అటవీ భూమి, ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్షం ఎత్తిచూపితే విధిలేక ఒప్పకుని, నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఓ చట్టాన్ని తీసుకొచ్చింది్ణ అని తెలిపారు. నాడు అసెంబ్లీలో వైఎస్ ప్రకటనను చంద్రబాబు విలేకరులకు చదివి వినిపించారు | ాగత రెండున్నరేళ్లుగా సీఎంగా ఉన్నాను. ఎక్కువకాలం ప్రజాప్రతినిధిగా ఉన్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చే వరకు ఆస్తిపాస్తుల వ్యవహారాలు మా తండ్రి చూసేవారు. అప్పట్లో కొన్న భూముల గురించి లెక్కలు తెలీదు. అసైన్డ కొనరాదు భూముల. అమ్మరాదు. రిజిస్ర్టేషన్ చేయరాదు. అమ్మేవాళ్లకి తెలుసో లేదో తెలీదు. కానీ, మా నాన్నకు తెలిస్తే కొనేవాడు కాదు. నాకు తెలిసినంత వరకు ఏ కొడుకు తండ్రిని ఆస్తి ఎలా సంపాదించావు, డాక్యుమెంట్లు చూపించు అని అడగడు. నేను కూడా అంతే. ఇది 610 ఎకరాలు. ప్రభుత్వానికి అప్పగించింది 310 .. పొరపాటున మొన్న 610 ఎకరాలన్నాను. అక్కడ ఉన్న భూమి మొత్తం 614.08 ఎకరాలు. నా కుటుంబం కొన్న పట్టా భూములు 120 ఎకరాలు, ప్రభుత్వానికి అప్పగించింది 310 ఎకరాలు, సొంతదార్లే అనుభవిస్తున్న అసైన్మెంట్ భూములు fifty ఎకరాలు, వ్యర్థంగా ఉన్న అసైన్డ భూములు 69.33 ఎకరాలు, దేవాలయ భూములు 6.96 ఎకరాలు, రాస్తా పోరంబోకు 7.86 ఎకరాలు. చెరువు భూములు 45.75 ఎకరాలు్ణ అని అసెంబ్లీలో వైఎస్ లెక్కలు చెప్పారని చంద్రబాబు వివరించారు. అసైన్డ్ భూములన్నీ ఇంతకాలం తాము అనుభవించామని, ఇప్పుడు వాటిని తిరిగి ఇచ్చేస్తున్నామని నాడు వైఎస్ సభాముఖంగా ప్రకటించారు. తిరిగి ఇచ్చినట్లు లెక్కల్లో చూపిస్తున్నా ఇప్పటికీ రాజంపేట మొత్తం వాళ్లే అనుభవిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఆనాడు అసైన్డ్ చట్టం మార్చి శిక్ష పడకుండా వైఎస్ తప్పించుకున్నారని పేర్కొన్నారు.

Actiteepi://wwwkandhrajyothykcom/artikl?sid=214867