రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనవద్దంటూ మంత్రి గీతారెడ్డికి నివాసాన్ని టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ముట్టడించారు. సోమవారం ఉదయం వీరు సికింద్రాబాద్‌లోని ఆమె నివాసం వద్ద బైఠాయించి నిరసనలు తెలిపారు. గీతారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. |