ప్రింటింగ్, క్యాలండర్, బొమ్మలు, అగ్గిపెట్టెలు, టపాకాయలు ఉత్పత్తిలో మినీ జపాన్‌గా శివకాశి వర్ధిల్లుతోంది. దీనికి శివకాశి విశ్వనాథుడి కరుణే కారణమని స్థానికుల, వ్యాపారుల నమ్మకం.
శివుడు కాశి నుంచి ఇక్కడికి చేరినందువలన శివుని కాశి అని పిలిచేవారు. కాలక్రమేణా శివకాశిగా మారింది. నార్త్‌లో కాశి, సౌత్‌లో తెన్‌కాశి మధ్యలో శివకాశిగా ఉంది. తిరుపతికి మొదటి, చివరి అక్ష రం ఒకటే అయినట్లు ఈ స్థలానికీ ఆ ప్రత్యేకత ఉంది.
ఆలయ చరిత్ర..
కుట్రాలం జలపాతం అంచున తెన్‌కాశి లో హరికేసరి పరాంకుశరాజు శివాలయాన్ని నిర్మించారు. ప్రతిష్ఠ చేయడానికి శివలింగాన్ని తెచ్చేందుకు కాశి..వెళ్లాడు. గంగానదిలో స్నానమాచరించి ఓ ఆవుపై శివలింగం తీసుకుని తెన్‌కాశికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ప్రస్తుతం శివకాశి నగరంలో ఉన్న ప్రాంతంలో బస చేశాడు. ఆవు అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరించింది. దీంతో శివలింగాన్ని తెన్‌కాశికి తీసుకుపోలేని పరిస్థితి నెలకొంది. చేసేది లేక ఆ బిల్వవనంలో శివలింగాన్ని ప్రతిష్ఠిం చాడు. స్వామికి కాశీ విశ్వనాథుడు అని నామకరణం చేశాడు. హరికేసరి పరాంకుశరాజు తరువాత ఆయన రాజ్యాన్ని ఏలి న పాండ్యరాజులు ఈ ఆలయంలో మం డపాలు, ప్రాకారాలు, తీర్థం,ప్రహరీ, రథ వీధులను ఏర్పాటు చేశారు. ఆలయంలో క్రీ.శ 1445లో నిర్మాణ పనులు ప్రారంభించి 16వ శతాబ్దంలో పూర్తి చేశారు.
కోరికలను త్యజించడానికి కాశీకి వెళుతా రు. అంతదూరం వెళ్లలేని వారు ఇక్కడి విశ్వనాథుని దర్శించుకుంటుంటారు. స్వామితో పాటు విశాలాక్షి ఇక్కడ దర్శనమిస్తోంది. వీరిని మొక్కుకున్నట్లయితే మనస్సు నిర్మలమవుతుందని భక్తుల విశ్వాసం. పౌర్ణమి, సంకటహరి చతుర్థి, ప్రదోష కాలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శివకాశి బస్టాండ్‌ని అంటుకుని మెయిన్‌బజార్‌లో ఆలయం ఉంది. బస్టాండ్ నుంచే నడిచి వెళ్లవచ్చు. ఉదయం 5.45 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వర కు, సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 9.15 గంటల వరకు ఆలయం తెరచి ఉంచుతారు. ఫోన్ నెంబరు 950091 6870, 04562272411.