దేశంలో ముఖ్యమంత్రిగా రోశయ్య నెంబర్ వన్ అని, ప్రపంచంలోకూడా మేటి నాయకుడని 20సూత్రాల ఆర్థిక కమిటీ చైర్మన్ తులసిరెడ్డి రోశయ్యను పొగడ్తలతో ముంచెత్తారు...నేడుమారుతున్న రాజకీయాలకు అనుగుణంగా యువత, అనుభవం కలిగిన వారు ఇరువురు పార్టీకి అవసరమని...పార్టీలో అనుభవంతోపాటు, యువత సేవలు కూడా కావాలని, జగన్ కూడా భవిష్యత్తులో సిఎం అయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రపంచంలోనే రోశయ్య ఉత్తమ సిఎంగా మొదటిస్థానంలో ఉన్నారని... ఆయనకు రాజకీయ అనుభవం అపారంగా ఉందని, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్సీగా, ఒక పర్యాయం ఎంపిగా, పిసిసి అధ్యక్షులుగా పదవులు అనుభవించారన్నారు. రోశయ్య పిసిసి అధ్యక్షులుగా ఉన్న కాలంలో రాష్ట్రంలో 22మంది ఎంపిలను గెలిపించిన ఘన చరిత్ర ఆయనకు ఉందన్నారు.