25, జనవరి 2011, మంగళవారం

భవిష్యత్తులో గుంటూరు జిల్లా ఎడారి

అన్నపూర్ణగా పిలువబడే గుంటూరు జిల్లా భవిష్యత్తులో ఎడారి కాబోతుందనే చేదు నిజం రైతాంగంలో ఆందోళన రేకెత్తిస్తోంది. గత నెల 30న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో మిగులు జలాలపై హక్కులు కోల్పోవడమే గాక ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతినివ్వడంతో గుంటూరు జిల్లాలో సాగర్ ఆయకట్టుతో పాటు కృష్ణాడెల్టా పరిధిలోని వేలాది ఎకరాలు బీడుగా మారనున్నాయి. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పులిచింతల ప్రాజెక్టు కూడా నిరుపయోగమయ్యే ప్రమాదం ఉంది. దీనిపై ప్రతిపక్షాలు చేసిన ఆందోళనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు.