ప్రభుత్వాలు ఓటరు నమోదును నిరంతర ప్రక్రియ కిందచేర్చాయి. ఓటరు నమోదు సంఖ్య పెరిగినప్పటికీ... నూటికి నూరుశాతం ఓటరు నమోదులో అధికారులు విఫలమవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోపక్క జాబితాలు తప్పులత డకగా ఉన్నాయి. ఓటర్ల తొలగింపులో చూపిన శ్రద్ద... కొత్త ఓటర్లను చేర్పించడంలో చూపడంలేదన్న అపవాదును అధికారులు మూటగట్టుకుంటున్నారు. ఫొటోలతో కూడిన పూర్తిస్థాయి జాబితాను తయారు చేయాలని ప్రభుత్వం గతేడాది నిర్ధేశించి, ఓటరు సవరణ కార్యక్రమాన్ని పూర్తిచేసింది.
నేడు జాతీయ ఓటరు నమోదు దినోత్సవం జాతీయ ఓటరునమోదు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. నిబంధనల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్ఓను నియమించారు. ఓటరు నమోదులో బీఎల్ఓలు నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తున్నారన్న ఆరోపణలు న్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు ప్రధాన కారణమన్న విమర్శలున్నాయి. ఈపరిస్థితుల్లో ఓటరునమోదు దినోత్సవం జరుగుతోంటే అధికారులు ఏస్థాయిలో స్పందిస్తారో వేచిచూడాల్సిందే.