హైదరాబాద్, జనవరి 27 : ఎట్టకేలకు ఉద్రిక్తతల నడుమ 'జైబోలో తెలంగాణ' చిత్రానికి గురువారం మధ్యాహ్నం సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'ఏ' సర్టిఫికేట్‌ను జారీ చేస్తూ అనుమతి ఇచ్చింది.
ఈ చిత్రం ఫిబ్రవరి నాలుగున రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతకు ముందు తెలంగాణ న్యాయవాదులు ఎఫ్‌డీసీ కార్యాలయాన్ని ముట్టడించారు.