27, జనవరి 2011, గురువారం

మంత్రి శంకర్ రావు పై "కులం" గొడవ

మంత్రి శంకర్‌రావు ఎస్సీ కులానికి చెందినవారు కాదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున ఆరోపించారు. మంత్రి కులం అంశంతోపాటు ఆయన ఆస్తులపైనా హైకోర్టులో కేసు వేయనున్నట్టు తెలిపారు.
శంకర్‌రావు కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన కటిక సామాజికవర్గానికి చెందిన వ్యక్తని ఆ రాష్ట్రంలో ఎస్సీలుగా పరిగణించే కటికలను మన రాష్ర్టంలో బీసీలుగా గుర్తిస్తారని తెలిపారు.