బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్లో అపశృతి చోటుచేసుకుంది. క్రేన్ విరిగిపడి కెమెరామెన్ విజయ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. విశాఖ జిల్లాలోని యారాడ అడవుల్లో ఈ ప్రమాదం జరిగింది.
ఫైట్ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌లు ఫైటింగ్ సీన్ షూట్ చేస్తుండగా 40 అడుగుల ఎత్తున్న క్రేన్ విరిగిపడటంతో విజయ్‌కుమార్ కాలి వేళ్లు తెగిపోయినట్లు సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు.