"మేం అందరం కాస్త వయసు మళ్లిన వాళ్లమే. నేటి తరం టీవీ ప్రేక్షకులకు ఏ తరహా వినోదం కావాలన్న దానిపై మాకు మూస అభిప్రాయాలే ఉంటాయి. ఓ యంగ్ మైండ్ మా బోర్డ్ సభ్యుల్లో ఉంటే బాగుంటుందని ఎన్నాళ్లుగానో చెబుతున్నాను. అది ఈనాటికి కుదిరింది'' అని నాగార్జున తెలిపారు. "సరికొత్త ఆలోచనలు కలిగిన ఇలాంటి యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీలను మా బోర్డులో చేర్చుకోవడం ద్వారా బోర్డు సభ్యుల సగటు వయసు తగ్గుతుంది' చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజను మా టీవీ బోర్డు సభ్యుల్లో ఒకరిగా చేర్చుకున్నట్లు ప్రకటించారు.