ఆ మధ్య సూపర్ హిట్ ఐన తను వెడ్స్ మను చిత్రాన్ని తెలుగులో అనువదించే హక్కుల కోసం పోటిబడ్డ నల్లమలపు బుజ్జి, దిల్ రాజులు చివరకి ఈ శిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాలని నిర్ణయించుకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓ వైపు రేమకే హక్కులపై సంప్రదింపులు జరుపుతూనే మరో వైపు నటీనటులేవరన్న విషయమై చర్చ జరుపుతున్నారట. కాగా ఈ చిత్రంలో హీరో హీరొయిన్ లుగా నటించేందుకు ఛార్మి, సాయి రామ్ శంకర్ లని ఎంపిక చేసినట్లు సమాచారం. మను వెడ్స్ తను పేరు పెట్టాలన్న యోచన చేస్తుండగా వెడ్డింగ్ అన్నపేరు కోడా పరిశీలనలో ఉన్నట్లు మరో భోగట్టా.