12, మార్చి 2011, శనివారం

'దొంగల ముఠా' ఖర్చు ఆరున్నర లక్షలే నట

సంచలనాల రాంగోపాల్ వర్మ ఏం మాట్లాడినా సంచలనం అయి కూర్చోన్తోంది. ఇప్పుడు తను నిర్మిస్తున్న 'దొంగల ముఠా' చిత్రం కు తను పెట్టిన పెట్టుబడి కేవలం ఆరున్నర లక్షలే అంటూ కొత్త స్టేట్ మెంట్ తో అంత నివ్వెర పోయేలా చేసాడు. పైగా మా దొంగల ముఠా ఒక్క షో ఆడినా అది సూపర్ హిట్ అయినట్టే... కోట్ల లో సంపాదిన్చేయటం ఖయమంటున్నాడు.
అన్నట్లు . వర్మ దృష్టి లో సినిమా ఫ్లాపులు నాలుగు రకాలట అందులో మొదటిది, నిర్మాత పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడం. రెండోది, డిస్ట్రిబ్యుటార్ పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడం. ప్రేక్షకులకు సినిమా నచ్చకపోవడం అన్నది మూడో రకం ఫ్లాపు. ఇక, విమర్శకులకు సినిమా నచ్చకపోవడం అన్నది నాలుగో రకం ఫ్లాపు.

వీటిలో మొదటి రకం ఫ్లాపును, నిర్మాత బడ్జెట్ ను తగ్గించుకోవడం ద్వారా అధిగమించవచ్చని తను చేసింది అదీ అంటున్నాడు వర్మ.మరి మిగిలిన మూడు ఫ్లాప్స్ గురించేమంటే చెప్పట్లే..