తెలంగాణ విషయంలో ఎవరి మాటా వినేది లేదని టీడీపీ సీనియర్ నేత నాగం జనార్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లో సాధనా యాత్రను చేపట్టనున్నామని .. అందువల్లే కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. కొందరు పనిగట్టుకుని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని .. తెలంగాణా అంశంలో పార్టీలో కొన్ని అభిప్రాయ భేదాలున్న మాట వాస్తవమే ఐనప్పటికీ అన్ని విషయాల్లోనూ పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటానని పత్రికల్లో తనపై వచ్చిన వార్తా కథనాలు అవాస్తవమని అన్నారు.