18, ఏప్రిల్ 2011, సోమవారం

ఒకే రోజు ఆరు సినిమాలు..జనాలు థియేటర్లవైపు రాలేదు...

సినిమారంగం పరిస్థితి ఏమాత్రం బాలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. పరిస్థితి బాగా లేకుంటే ఒకే రోజు ఆరు సినిమాలు ఎలా విడుదలవుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. గతవారం ఏప్రిల్‌ 8వ తేదీన నాలుగు డబ్బింగ్‌ చిత్రాలు, రెండు స్ట్రయిట్‌ చిత్రాలు ప్రేక్షకుల ముందుకువచ్చాయి. ఈ ఆరు చిత్రలకు కనీసస్థాయి ఓపెనింగ్స్‌ లేవు. థియేటర్లన్నీ వెలవెలబోయాయి. శివాజీ నటించిన 'లోకమే కొత్తగా', సూపర్‌గుడ్‌ సంస్థ తీసిన 'మంచివాడు' చిత్రాలకు కనీస స్థాయి కలక్షన్స్‌ రాలేదు.
ఈ చిత్రాల ఫలితాన్ని ముందుగా అంచనావేసినప్పటికీ, ఇంత ఇదిగా ఉంటాయని మాత్రం వాణిజ్య వర్గాలు భావించలేదు. హీరోలమంటూ సినిమాకు లక్షల్లో డిమాండ్‌ చేసేవారు, తమకున్న ఇమేజ్‌ ఎలాంటిది? ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సామర్ద్యం ఉందా? విషయాన్ని గ్రహిస్తే మంచిదని సినీపండితులు సలహా ఇస్తున్నారు. ఇక డబ్బింగ్‌ చిత్రాలది కూడా సేమ్‌ సిట్యూవేషన్‌. ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటీ పూర్తికావడంతోనే రిలీజ్‌ చేసినా, జనాలు థియేటర్లవైపు రాలేదు.