18, ఏప్రిల్ 2011, సోమవారం

గంగపుత్రులు సెన్సార్ కట్స్

పి. సునీల్‌ కుమార్‌రెడ్డి రచన, స్క్రీన్‌ ప్లే దర్శకత్వం సమకూర్చిన 'గంగపుత్రులు' చిత్రాన్ని కె.బి.ఆర్‌. ప్రొడక్షన్స్‌, శ్రావ్య ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మించారు. సుబ్బరాజు, గాయత్రి, రామ్‌, తన్మయి, మహేష్‌, రావు రమేష్‌ ముఖ్యపాత్రలు పోషించారు.
అయిదుగురు సభ్యులతో కూడిన 'ఇసి' ఈ చిత్రాన్ని చూసి 9 కట్స్‌తో 81.12 అడుగుల ఫిలిం కత్తిరించి 24-3-2011న 'యు' సర్టిఫికెట్‌ జారీ చేసింది.
1. మూడవ రీలులోని ...
ఎ) రెండో పాటలో బొడ్డు చూపెడుతూ, చిత్రీకరించిన క్లీవేజ్‌ షాట్స్‌ని 4.07 అడుగుల నిడివికి కత్తిరించారు. అయితే అంగీకారయోగ్యమైన అంతే నిడివిగల మరో షాట్‌ని ఉంచారు.
బి) పయిట లేకుండా ఇసుకపై హీరోయిన్‌ వెల్లకిలా పరుండే దృశ్యాలను 9.14 అడుగుల మేర కత్తెరించి, అంతే నిడివిగల అంగీకరింపబడిన మరో దృశ్యాన్ని ఉంచడానికి అంగీకరించారు.
సి) హీరోయిన్‌ సముద్రంలో స్నానం చేసే సన్నివేశాలను 32.02 అడుగుల నిడివికి కత్తెరించి ఆ దృశ్యాన్ని ఫ్లాష్‌లా చూపమన్నారు.
డి) మూడవ పాటలో చనుకట్టు ఎక్స్‌పోజర్‌కి సంబంధించిన దృశ్యాలను తొలగించడం వలన 21-02 అడుగులు నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.
ఇ) సన్నిహితంగా ప్రేమించుకునే దృశ్యాలు, హీరోయిన్‌ తన దుస్తులు విప్పేసే దృశ్యాలను 4.13 అడుగులమేరకు తొలగించి, అంతే నిడివిగల అంగీకృతమైన వేరే దృశ్యాలను ఉంచడానికి అంగీకరించారు.
ఎఫ్‌) తెల్లని బ్రా వేసుకుని నీలిరంగు చీర ధరించి చనుకట్టు పై చేతులుంచుకున్న దృశ్యాలను తొలగించడం ద్వారా 28.08 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.
2. నాలుగవ రీలులో...
ఎ) సన్నివేశంలో చిత్రీకరించిన జలయజ్ఞం, సోంపేట, గంగవరం పదాలను బాడకోవ్‌ పదాన్ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
బి) పయిట లేకుండా హీరోయిన్‌ పై బీచ్‌లో చిత్రీకరించిన దృశ్యాలను 7.08 అడుగుల నిడివి మేరకు కత్తిరించి అంగీకృతమైన అదే నిడివిగల వేరే దృశ్యాలను ఉంచడానికి అంగీకరించాలి.
సి. బీచ్‌లో హీరోతో మాట్లాడుతున్న హీరోయిన్‌ ఎక్స్‌పోజ్‌ చేసేలా చిత్రీకరించిన దృశ్యాలను తొలగించడమో బ్లర్‌ చేయడమో చేయాలని సూచించగా బ్లర్‌ చేసారు.
ఈ రకంగా 108.06 అడుగుల ఫిలింని కత్తిరించడం, 26.10 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరించి వేరే షాట్స్‌తో కలపడం వల్ల మొత్తం 81.12 అడుగుల పొడవు ఫిలిం కత్తెరింపుకు గురి అయింది. 3354.90 మీటర్ల నిడివిగల 'గంగపుత్రులు' చిత్రం విడుదలయింది.