యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ మతంపై సమాచారం వెల్లడించడం అంటీ వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడడ టమే అని జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్, జస్టిస్ ఏకే పట్నాయక్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రజాసమాచార అధికారి నుంచి ఈ వివరాలను హర్యానా మాజీ డీజీపీ పీసీ వాధ్వా సమాచార హక్కు చట్టం కింద సోనియా ఆమె పిల్లల మతం, విశ్వాసం ఏంటో బహిర్గతం చేయాలంటూ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి చేష్టలు తగనివని ఇంతకు ముందు ఈ కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.