19, ఆగస్టు 2011, శుక్రవారం

జీవితాలను శాసిస్తున్న స్మార్ట్‌ ఫోన్లు

గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ ఫోన్ల వాడకం ఎంత పెరుగుతోందో... దానికి మించి స్మార్ట్‌ ఫోన్లని హ్యాకింగ్‌, ఇతర భద్రతల పట్ల వస్త్తున్న ఆందోళనలూ పెరుగుతున్నాయి. అయితే ఈ తరహా ఆందోళనలు అవసరం లేదని, ఐ ఫోన్లని తొలిసారిగా కొనేవారిలో ఈ ఆందోళన ఎక్కువగా ఉన్నట్లు తాము గుర్తించినట్లు ఫ్ల్లోరిడా యూనివర్శిటీ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్న లిసా మెర్లో చెప్పారు.

స్మార్ట్‌ ఫోన్లలోని వివిధ ఫీచర్లు ఆకర్షణీయంగా ఉండి వినియోగదారులను తమ వైపుకు తిపðకుంటున్నాయనటంలో సందేహంలేదు. టీనేజర్లలో ప్రేమ సందేశాలతో సహా పలు రకాల సంక్షిప్త సమాచారం అందించడంలో స్మార్ట్‌ ఫోన్లు ముందున్నాయని... పార్టీలు జరుగుతున్నపðడు మైకుల లో వచ్చే పాటల హౌరులోనూ వీటిలో వచ్చే సంగీతంపైనె ఎక్కువ మంది మక్కువ చూపించడం గమనించినట్ల్లు ఆమె వెల్లడించారు. అంతలా వీరు స్మార్ట్‌ ఫోన్లతో అనుబంధాన్ని పెనవేసుకున్నారనటాకి ఇది ఓ ఉదాహరణ మాత్రమేనని చెప్పారు.

ఇక సెల్‌ ఫోన్లు-టీనేజర్ల అనుబంధంపై పరిశోధనలు చేసి ఇంటెల్‌ సైన్స్‌ సెంటర్‌లో 75 వేల డాలర్లు కైవసం చేసుకున్న న్యూయార్క్‌లోని లాంగ్‌ ఐలాండ్‌కి చెందిన మైఖేల్‌ హాకమెేన్‌ మాట్లాడుతూ ధనిక కుటుంబాలకే ఇన్నాళ్లు పరిమితమైన ఫోన్లు విస్తృతం చెందాయని... అనేక రూపాలలో లక్షలాది మంది విద్య్యార్ధులు స్మార్ట్‌ ఫోన్లని వినియోగిస్తున్నారని... ముఖ్యంగా లెక్చరర్లు పాఠాలు చెప్పేటపðడు వాటిని మరోమారు వినాలనుకునేవారు రికార్డు చేసుకుంటున్న ఘటనలు కూడా తాను చూసినట్లు చెప్పారు. హైస్కూల్‌ విద్యార్ధులలోనూ ఫోన్ల వాడకం పెరుగుతోందని.. వారి అవసరాలు గుర్తించి పెద్దలూ ప్రోత్సహిస్తున్నారని తన పరిశోధనలో తేలినట్లు చెప్పారామె.

అయితే స్మార్ట్‌ ఫోన్లతో ఎన్ని మంచి పనులు చేయచ్చో... అన్ని దుష్పరిణామాలున్నాయని చెప్తున్నారు యూఎస్‌కి చెందిన మానసిక వైద్య నిపుణులు, స్లీప్‌ స్పెషలిస్ట్‌ అయిన మైఖేల్‌ బ్యూర్స్‌. ప్రీ రిసెర్స్‌ సెంటర్‌ చేసిన సర్వే ప్రకారం యూఎస్‌లో 35 శాతం మందికి పైగా ప్రజలు స్మార్ట్‌ ఫోన్లని వినియోగిస్తున్నారని.. వీరిలో ఫోన్లని తాము నిద్రపోయేపðడు పక్కలో పెట్టుకోవటం వల్ల అనేక రకాల రుగ్మతలకు లోనవుతున్నారని ఆయన చెప్పారు. రాత్రి వేళ అదే పనిగా స్మార్ట్‌ ఫోన్లలో మెయిల్స్‌ చెక చేసుకోవటం, ఛాటింగ్‌ చేయటం వల్ల నిద్ర కరువవుతోందని దీంతో ఆ ప్రభావం మెదడుపై పడి జ్ఞాపక శక్తి తగ్గుతున్నట్లు గుర్తించామని వెల్లడించారు.

నగదు భారీ చెల్ల్లింపుల సంగతి కన్నా పిల్లల్లో చెడ ప్రవర్తనకి స్మార్ట్‌ ఫోన్లు కారణమవుతున్నాయని వాషింగ్టన్‌ డిసిలో పనిచేస్తున్న టోనియా జంపిరియా ఆవేదన వ్యక్తం చేసింది. నా మేనకోడలుకి నే కొనిచ్చిన ఫోన్‌ని ఈ మధ్య పరిశీలిస్తే దాని నింపుగా బేతు వీడియోలు, అశ్లీల సమాచారాలు ఉన్నాయి. అసలు టీనేజర్ల ఫోన్‌ల విషయంలో సెన్సారింగ్‌ ఉండేలా ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు.

మరోవైపు స్మార్ట్‌ ఫోన్లలోని ఫీచర్లు నచ్చి దాని ఆకర్షణలో పడ్డ్డాక .. అందుకు వేలల్లో ఖర్చు చేస్తున్న సందర్భాలూ లేక పోలేదని యూఎస్‌లోని జెడి పవర్‌ అసోసియేట్స్‌ ప్రతినిధులు చెప్తున్నారు. అమెరికాలో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుడు ప్రతి ఒక్కరూ సగటున 107 డాలర్లు డేటా కోసవెూ... ఇతరత్రానో ఈ ఫోన్లపై ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదే విషయంపై ఓ హియోలో ప్రొఫషల్‌ మార్కెటింగ్‌ నిష్ణాతుడైన క్రిస్టన్‌ విల్సన్‌ మాట్లాడుతూ... కేవల తాను మెయిల్స్‌ని మెబైల్‌లో చెక చేసుకుంటానని... ఇతర వాణిజ్య కార్యకలాపాలకు చెందిన ఫోన్లు కోసం నిరంతరం ఫోన్‌లో అవసరం ఉంటుంది. దాదాపు వినోద సాధనం కూడా నాకు ఈ ఫోనే... ఇందుకు ప్రతి నెల ఖర్చు కూడా భారీగానే ఉంటుందని చెప్పాడు

మెబైల్‌ వాణిజ్య వేత్తలు కూడా వీటిని ధృవీకరిస్తూ... ఏటా వెబ్‌సైట్లు, మెబైల్స్‌లలో వివిధ రకాలు అప్లికేషన్ల మార్పులు, చేర్పులపై తాము ఏటా 6 బిలియన్‌ డాలర్ల వ్యాపారం చేస్తున్నామన్నారు.

- ఎం రాంగోపాల్‌