సినీతారల క్రికెట్ మ్యాచ్‌లో బాలకృష్ణ జట్టుపై శ్రీకాంత్ జట్టు మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. సినీతారల క్రికెట్ మ్యాచ్ అనంతపురంలో ఆర్‌ఆర్‌డీ మైదానంలో జరిగింది. తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకున్న బాలకృష్ణ జట్టు 169 పరుగులు చేసింది. 170 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీకాంత్ జట్టు 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.