15, నవంబర్ 2011, మంగళవారం

చూపుడు బొమ్మ సి.బి.ఐ



సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సి.బి.ఐ). ప్రస్తుతం పరిచయం అక్కరలేని పేరు.
గత కొంతకాలంగా సామాన్యులలో సౖౖెతం నానుతున్న పేరుది.
ఈ కేంద్ర నేర పరిశోధనా విభాగం కళ్ళలో పడితే నేరస్థులకు తిప్పలు తప్పవు.
ఏస్థాయిలో ఉన్నా వదలకుండా వెంటాడి మరీ సోదాల నుంచి నిర్బంధం వరకు
చివరకి జైలు జీవితం కూడా రుచి చూపించగల సత్త్తా ఉన్న సంస్ధ.
అయితే రోజు రోజుకీ దేశ వ్యాప్తంగా నేరాల సంఖ్య పెరుగుతుండటంతో...
సిబ్బంది కొరత కారణంగా అంతే స్ధ్ధాయిలో దర్యాప్తు జరగక ఫైళ్లు పేరుకుపోతుండటం ఆందోళన కలిగించే అంశం.
అసలు సి.బి.ఐ. పుట్టుక ఈనాటిది కాదు. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే.. రెండో ప్రపంచ యుద్ధంమపðడు యుద్ధ నిర్వహణలో జరిగే అవినీతి, లంచగొండితనం గుర్తించి వాటి నిర్మూల నపై దృష్టి కేంద్రీకరించేందుకు అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం 1941లో స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఎస్‌.పి.ఇ) పేరుతో ఓ సంస్ధని ఏర్పా టు చేసి దాని పర్యవేక్షణ బాధ్యతను యుద్ధ విభాగానికి అప్పగించింది. అప్పటి యుద్ధం ముగిసినా...ఎస్‌పిఇ చేపట్ట్టిన చాాలా కేసులు పరిష్కా రానికి నోచుకోని విషయాన్ని గమనించిన పాలకులు 1946లో 'ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం' రూపొందించారు.
స్వాతంత్రానంతరం ఎస్‌.పి.ఇని విస్తరించి దానిని హౌంశాఖ క్రింద పనిచేసేలా చేేయటమే కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ దీని పరిధిలోకి తెచ్చారు. అనంతరం కొద్ద్ది కాలానికి కేంద్ర పాలిత ప్రాంతాలను చేర్చి రాష్ట్ర ప్రభుత్వం కోరిన పక్షంలో మాత్రమే జోక్యం చేసుకుంటామన్న పరిధిని విధించారు. అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రత్యేకంగా దర్యాప్త్తుకు ఉత్తర్వులిచ్చేపðడు దానిని అనుసరించి నేర పరిశోధన చేసేలా నియమావళిని నిర్దేశించారు.
అయితే కాలక్రమేణా పెరుగుతున్న నేరాలను దృష్టిలో ఉంచుకొని.. 1963, ఏప్రిల్‌ 1నసెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సి.బి.ఐ)గా పేరు మార్చి, కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలను దీని పరిధిలోకి తెచ్చారు. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై మాత్రమే గురిపెట్టే నిఘా సంస్ధగా విమర్శలెదుర్కొంటున్న తరుణంలో 1965లో ఆర్థిక నేరాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపిన నేరాలు, హత్యలు, కిడ్నాపులు, తీవ్రవాద నేరాలపై పరిశోధన చేపట్టడం ప్రారంభించింది. తొలినాళ్లలో సి.బి.ఐ. డైరెక్టర్‌ డి.పి. కోహ్లి నేతృత్వంలో అనేక కేసు పరిష్కారం జరిగింది. దీంతో ఆయన అందించిన సేవలకుగాను 1967లో 'పద్మభూషణ్‌' పురస్కారం వరించింది. సి.బి.ఐ. పనితీరు 'పరిశ్రమ, నిష్పక్షపాతం, సమైక్యత'లనే.. ప్రధా నాంశాలుగా తీసుకొని పనిచేయాలని కోహ్లీ చేసిన నిర్ధేశాల మేరకే నేటికీ సిబిఐ పనిచేస్త్తోంది. 1969లో బ్యాంకుల జాతీయకరణతో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు సి.బి.ఐ. నిఘా కళ్ళలోకి వచ్చేశారు. అయితే, గత కొంత కాలంగా సి.బి.ఐ. అంటే ప్రభుత్వం తనప్రత్య ర్థులపై కక్షసాధించే సంస్ధగా మార్చేసారని, 'కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌', 'కాంగ్రెస్‌ బచావో ఇనిస్టిట్యూషన్‌' ఇలా పలు నిర్వ చనా లతో విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సిబిఐ అడపాదడపా కొంతమందిపై కొండెత్తి పెట్టా లనే విధంగా వేగం గా పరిశోధన చేసి విమర్శలను మూటకటుకొంటూ... 'నిష్పక్ష పాతం', విధి నిర్వహణ అందరికీ వర్తించదా అన్న ప్రశ్నలకు తావిస్తోంది. ఇక సిబిఐ వద్ద పేరుకు పోతున్న కేసుల సంఖ్య పెరుగుతున్నా..తగినంత సిబ్బంది లేకపోవటం వల్ల పరిష్కార దిశగా పయనించట్లేదని సంబంధిత మంత్రి పార్లమెంటులో లెక్కల చిట్టా విప్పారు. ఇది ఆందోళన కలిగించే అంశమే. ఇలా అయితే మూలనబడ్డ నేరపరిశోధన తేలేదెన్నడో అమాత్యులే సెలవియ్యాలి!
సి.బి.ఐ. బాసులు వీరే...
అవినీతి సంబంధ కేసులు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ విభాగానికి, ఇతర విషయాలను కేంద్ర ప్రభుత్వ పర్సనల్‌, పెన్షన్‌ గ్రీవెన్సెస్‌ ఆధీనంలోని పర్సనల్‌ మరియు ట్రైనింగ్‌ విభాగానికి సి.బి.ఐ. జవాబుదారీగా పనిచేస్తుంది.
నేరుగా పరిశోధన చేపట్టకూడదు: కేంద్ర పాలిత ప్రాంతాలలో తప్ప మిగిలిన చోట్ల సి.బి.ఐ. నేరుగా నేరాల పరిశోధనను చేపట్టకూడదు. ఒకవేళ రాష్ట్రాలలోని నేరాలను దర్యాప్తు చేయమని కేంద్రం కోరినా, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో, రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పుడు దర్యాప్తు చేస్తుంది. అయితే రాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టులు ఆదేశిస్తే ప్రభుత్వాల తో పనిలేకుండా నేర పరిశోధన చేసే అధికారం సి.బి.ఐ.కి ఉంది.
సి.బి.ఐ.లోనూ అంతర్గత నిఘా: ఇతరులపై నిఘా ఉంచే సి.బి.ఐ. లోనూ అంతర్గత నిఘా వ్యవస్థ ఉంది. తమ శాఖ అధికారులలో ఎవరైనా అవినీతి పరులుంటే వారిపై క్రిమినల్‌ కేసులు నవెూదు చేయడానికి వెనుకాడమని స్వయంగా సి.బి.ఐ ప్రకటించడమంటే దాని కర్థం వారే విడమరిచి చెప్పాలి.
సి.బి.ఐ.లో విభాగాలు, విధులు: సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌కు అత్యున్నత అధికారిగా డైరెక్టర్‌ ఉంటారు. ప్రధాన కార్యాలయం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. డైరెక్టర్‌ పరిధిని మూడు జోన్లుగా విభజిం చారు. వీటికి అధిపతులుగా స్పెషల్‌ డైరెక్టర్‌ (ఎ), స్పెషల్‌ డైరెక్టర్‌ (బి), స్పెషల్‌ డైరెక్టర్‌ (సి)లు ఉన్నారు. ఈ మూడు స్పెషల్‌ డైరెక్టర్ల పరిధితోపాటు డైరెక్టర్‌ నేరుగా పాలసీ డివిజన్‌, ఎడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ డివిజన్‌, లీగల్‌ ప్రాసిక్యూషన్‌ డివిజన్‌, టెక్నికల్‌, ఫోరెన్సిక అండ్‌ కో-ఆర్డినేషన్‌ (టి.ఎఫ్‌.సి) జోన్‌లను పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం సి.బి.ఐ. డైరెక్టర్‌గా ఎ.పి.సింగ్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
స్పెషల్‌ డైరెక్టర్‌ (ఎ): స్పెషల్‌ క్రైం జోన్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, మల్టీ డిసిప్లినరీ మానిటరింగ్‌ ఏజన్సీ జోన్‌, లక్నో, కోల్‌కతా, గౌహతి, పాట్నా జోన్‌లు ఈ పరిధిలోకి వస్తాయి. లక్నో, డెహరాడూన్‌, ఘజియాబాద్‌, కోల్‌కతా భువనేశ్వర్‌,గౌహతి, షిల్లాంగ్‌, ఇంపాల్‌, పాట్నా, రాంచి, ధన్‌బాద్‌లలో ఎ.సి.బి. కార్యాలయాలు న్నాయి. లక్నో, కోల్‌కతాలలో స్పెషల్‌ క్రైం బ్రాంచీలు, కోల్‌కతాలో ఎకనామిక అపెన్స్‌ (ఆర్థిక నేరాలు) వింగ్‌ ఉంది. ఢిల్లీ, ముంబై, చెన్నైలలో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, మల్టీడిసిప్లినరీ మానిటరింగ్‌ ఏజెన్సీలు ఉన్నాయి.
స్పెషల్‌ డైరెక్టర్‌ (బి): ఇందులో చెన్నై జోన్‌, హైదరాబాద్‌ జోన్‌, ముంబాయి 1, 2 జోన్లు, బి.ఎస్‌ అండ్‌ ఎఫ్‌ జోన్‌, ఎకనామిక అఫెన్స్‌ జోన్లు ఉన్నాయి. చెన్నై, కొచ్చి, హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖ పట్నం, ముంబై, నాగపూర్‌, పూణె, గోవా, గాంధీనగర్‌ కేంద్రాలుగా ఎ.సి.బి. కార్యాలయాలున్నాయి. తిరువనంత పురం, చెన్నై, ముంబైలలో స్పెషల్‌ క్రైంబ్రాంచీలు, ఆర్థిక నేరాల విభాగం చెన్నై, ముంబైలు ఈ జోన్‌ పరిధి లో ఉన్నాయి. బ్యాంక సెక్యూరిటీ అండ్‌ ఫ్రాడ్‌ విభాగం ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో ఉన్నాయి. ఎకనామిక అఫెన్స్‌ జోన్‌కు కార్యాలయం ఢిల్లీలోనే ఉంది.
స్పెషల్‌ డైరెక్టర్‌ (సి): దీని పరిధిలో చండీగర్‌, ఢిల్లీ, భోపాల్‌ జోన్లతోపాటు, ఎ.సి.బికి వివిధ యూనిట్లు న్నాయి. ఈ డైరెక్టరేట్‌ పరిధిలో చండీగర్‌, జమ్మూ, ఢిల్లీ, జైపూర్‌, జోధ్‌పూర్‌, భోపాల్‌, జబల్‌పూర్‌, ఛత్తీస్‌గడ్‌లలో ఎ.సి.బి. కార్యాలయాలున్నాయి.
డైరెక్టర్‌ స్వీయ పర్యవేక్షణ: డైరెక్టర్‌ స్వీయ పర్యవేక్షణలో పాలసీ డివిజన్‌, పరిపాలన, శిక్షణ, లీగల్‌ అండ్‌ ప్రాసిక్యూషన్‌ డివిజన్‌, టెక్నికల్‌, ఫోరెన్సిక అండ్‌ కో-ఆర్డినేషన్‌ జోన్లు ఉన్నాయి. వీటన్నింటికీ వేర్వేరుగా అధికారులున్నప్పటికీ వారందరూ నేరుగా డైరెక్టరుకు రిపోర్టు చేస్తారు. పాలసీ డివిజన్‌లో మీడియా, కమ్యూనికేషన్‌, విజిలె న్స్‌ సెల్‌లు ఉన్నాయి. టెక్నికల్‌, ఫోరెన్సిక అండ్‌ కో-ఆర్డినేషన్‌ (టి.ఎఫ్‌.సి) జోన్‌ను రెండు విభాగాలు చేశారు. ఇంటర్‌పోల్‌, ఇంటర్నేషనల్‌ పోలీస్‌ కో-ఆపరేషన్‌ సెల్‌, సిస్టమ్‌ డివిజన్‌, టెక్ని కల్‌ ఎడ్వైజరీ యూనిట్లను డి.డి.ఏ.పి.సి. యులో భాగంగా చేశారు. సి.ఎఫ్‌. ఎస్‌.ఎల్‌ (సెంట్రల్‌ ఫోరెన్సిక సైన్స్‌ లేబొరేటరీ)లో భాగంగా బాలిస్టిక్స, బయాలజీ, కెమెస్ట్రీ, కంప్యూటర్‌ ఫోరె న్సిస్‌, డి.ఎన్‌.ఎ. ఫ్రొఫైలింగ్‌, డాక్యు మెంట్‌, ఫింగర్‌ ప్రింట్‌, లై డిటెక్టర్‌, ఫోటో అండ్‌ సైంటిఫిక ఎయిడ్‌, ఫిజి క్స, సెరాలజీ విభాగాలను ఏర్పాటు చేసి వీటన్నింటికీ ఢిల్లీని ముఖ్య కేంద్రంగా ఉంచారు. అయితే చెన్నైలో సైంటిఫిక ఎయిడ్‌ యూనిట్‌ను ఏర్పా టు చేశారు.మన రాష్ట్రం నుంచి కె. విజయరామారావు దాదాపు మూడేళ్ళ పాటు డైరెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే...
ఉద్యోగుల కొరత ఉన్నా భర్తీ చేయరు
రాను రానూ నేరాల సంఖ్య పెరుగుతూ.. న్యాయస్థానాల తీర్పులు నత్తనడకన సాగుతున్నాయనే విమర్శల నేపధ్యంలో ఇటీవల రాజ్యసభలో మొత్తం 5665 పోస్టులకు గాను 5361 ఖాళీలు భర్తీ చేశామని, ఉద్యోగుల కారణంగా సిబిఐలో పనివేగం మందగించలేదని కేంద్ర పర్సనల్‌, పబ్లిక గ్రీవెన్స్‌, పెన్షన్స్‌ మంత్రి వి.నారాయణస్వామి చెప్పుకొచ్చారు. డిప్యుటేషన్‌పై తెచ్చే విధానానికి స్వస్తి చెప్పి, త్వరలో కాంట్రాక్టు ఉద్యోగులను లా ఆఫీసర్లుగా, టెక్నికల్‌ అధికార్లుగా, క్లర్కులుగా నియమిస్తామని, అంతర్గత పదోన్నతులు, కొత్త రిక్రూట్‌ మెంట్‌లు చేపడతామన్న ఆయన ఇతర శాఖల నుంచి సి.బి.ఐకు డిప్యుటేషన్‌పై రావడానికి ఉన్నతోద్యోగులు సుముఖంగా లేరని వ్యాఖ్యానించడం కొసమెరుపు. .
సి.బి.ఐ.లో వికేంద్రీకరణ: సి.బి.ఐ. 1987లో తన శాఖను ఎ.సి.డి(యాంటీ కరప్షన్‌ డివిజన్‌), ఎస్‌.సి.డి (స్పెషల్‌ క్రైం డివిజన్‌), ఇ.ఒ.డి (ఎకనామిక అఫెన్స్‌ డిజన్‌)గా విస్తరించింది. తీవ్రవాద నేరాల నేపథ్యంలో ఏర్పడ్డ ఎన్‌.ఐ.ఎ (నాటియో ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) సి.బి.ఐ. పరిధిలోకి రాదు.
ఎ.సి.డి. (యాంటీ కరప్షన్‌ డివిజన్‌): అవినీతి నిరోధక విభాగం ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ చట్టం 1988ని అనుసరించి, ప్రభుత్వ పెద్దలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, దాని అనుబంధ సంస్థలు, కార్పోరేషన్లు, కేంద్ర ప్రభుత్వం అధీనంలో పని చేసే అన్ని రకాల సంస్థలు దీని నిఘా పరిధిలో ఉంటాయి.
ఇ.ఒ.డి. (ఎకనామిక అఫెన్సెస్‌ డివిజన్‌): ఆర్థిక స్కాంలు, నేరాలు, దొంగనోట్ల ముద్రణ, పంపిణీ, బ్యాంకు లావాదేవీల్లో వెూసం, సైబర్‌ నేరాల పరిశోధన వంటివి ఇ.ఒ.డి. పరిధిలోకి వస్తాయి.
ఎస్‌.సి.డి. (స్పెషల్‌ క్రైం డివిజన్‌): రాష్ట్ర ప్రభుత్వ కోరినా..హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలపై ఈ డివిజన్‌ ప్రత్యేకంగా పని చేస్తుంది. తీవ్రమైన, సంచలనం కలిగించిన కేసుల్లో పక్కా ప్రణాళికతో పరిశోధించడం వంటివి ఈ విభాగ విధి నిర్వహ ణలో ముఖ్య భాగం. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సి.బి.ఐ. దర్యాప్తు చేపట్టడాన్ని సెక్షన్‌ 3,డి.ఎస్‌.పి.ఇ. చట్టం అనుమతిస్తుంది.
'ట్రాప్‌'లో పడటమంటే...: అవినీతిపరులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని వలవేసి పట్టే విధానానికి 'ట్రాప్‌' పదం.. వాడతా రు.దీనికి చట్టబద్ధత లేదు. ఫిర్యాదిదారుడు ఏ ఉద్యోగిపైనైనా ఫిర్యాదు చేయదలుచుకుంటే తను స్వంత సొమ్మును ఆ ఉద్యోగికి ఎరగా చూపి ఆ క్షణానే అవినీతి వ్యతిరేక విభాగా నికి పట్టిస్తాడు. సమాన ధనాన్ని సాధారణంగా సి.బి.ఐ. ఛార్జీషీట్‌ నవెూదు చేసిన తర్వాత ఫిర్యాదు దారునికి తిరిగి ఇస్తుం ది. ఇదీ 'ట్రాప్‌' కథ. లంచం అడిగిన సందర్భంలో, ఇవ్వకున్నా 'ట్రాప్‌' చెల్లుతుంది. లంచం ఇవ్వడంనేరమే ఐనా లంచం ఇస్తానని ఒప్పుకొని, అధికారులకు ఫిర్యాదు చేస్తే 'అవినీతి నిరోధక చట్టం 1988' ప్రకారం లంచం ఇచ్చిన వారిని శిక్షించదు. నిజాయితీపరులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని ఇబ్బందులకు గురి చేసేందుకు లంచం ఎరచూపితే ఉద్యోగి సిబిఐకి ఫిర్యాదు చేసి లంచం ఇవ్వాలనుకున్న వ్యక్తికి శిక్షపడేలా చేయవచ్చు. లంచం ఇస్తున్న వ్యక్తి, తీసుకున్న వ్యక్తి ఇద్దరినీ ఒకే సందర్భంలో పట్టుకున్న సంఘటనలూ ఉన్నాయి.
ఎంతటి దూర ప్రయాణమైనా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. అవినీతి అంతాన్ని కోరుకుంటున్న భారతీయుల ఆకాంక్షలను అందుకునే స్థాయికి సిబిఐ చేరుతుందని మనమూ ఆశిద్దాం.
పౌరులూ ఫిర్యాదు చేయొచ్చు
అతి పెద్ద నేరం జరుగుతోందని తెలిస్తే.. ఆ సమాచారం నేరుగా పౌరులే సి.బి.ఐ.కి ఫిర్యాదు చేయవచ్చు. ఆర్థిక నేరాలు, ప్రత్యేక నేరాలు, డ్రగ్స్‌, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, నకిలీ నోట్లు, అటవీ మృగాల అక్రమ నిర్బంధం, జాతీయస్థాయి లేదా అంతర్‌రాష్ట్రస్థాయి నేర నిర్వహణ తదితరా లపై సైతం ఫిర్యాదు చేయవచ్చు.ఉద్యోగులు లంచమడిగితే... అవినీతి నిరోధక శాఖకు, రాష్ట్రస్థాయిలో పరిష్కరించగలిగే కేసులను స్థానిక పోలీసులకు తెలపాలి,ఇప్పటికే పోలీసు దర్యాప్తు జరుగుతుంటే.. ఆ నేరాన్ని సిబిఐ పరిశోధించే అవకాశం ఉంది. ఫిర్యాదీ అన్ని వివరాలను సమగ్రంగా అందిస్తే మంచిది. మీరు చేసే ఫిర్యాదు, మీ పేరు గోప్యంగా ఉంచుతారు. ఫిర్యాదు అందుకున్న అధికారి సంస్ధలో మరో ఉన్నతాధికారికి కూడా చెప్పరు.అలా అడిగే అధికారం లేదు. న్యాయస్థానాలు సైతం ఫిర్యాదుదారునికి సంబంధించిన సమాచారం వెల్లడించమని ఒత్తిడి చేయకూడదు.
సి.బి.ఐ. స్వతంత్ర సంస్థ కాదు
కిరణ్‌ బేడీ విమర్శ
ఈ మాజీ ఐ.పి.ఎస్‌. అధికారి మాటల్లో చెప్పాలంటే సి.బి.ఐ. స్వతంత్య్ర సంస్థ కాదు. 'ఇది ప్రభుత్వ ఏజెన్సీ. వారి నియామకాలు, వనరులు, పదోన్నతులు, లాయర్లు, బడ్జెట్‌ అన్నీ రాజకీయనేతల చేతిల్లో ఉంది. దీన్ని లోకపాేల్‌ పరిధిలోకి తీసుకువస్తే ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. లేకుంటే దాని పనితీరు కేంద్ర ప్రభుత్వం చేతిలోని ఊతకర్రలా మిగిలి పోతుంది'. ఎన్నో ఏళ్ళపాటు పోలీస్‌ శాఖలో పనిచేసిన ఈ సీనియర్‌, సిన్సియర్‌ పోలీస్‌ అధికారి మాటలను నిశితంగా పరిశీలిస్తే ప్రస్తుత సి.బి.ఐ. పరిస్థితి అర్థమవుతుంది.
సి.బి.ఐ.లో చేరాలనుంటే..:
సి.బి.ఐ. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా సబ్‌ ఇన్‌స్పెక్టర్ల స్థాయి అధికారులను ఎంపిక చేస్తారు. రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేసే ఇన్‌స్పెక్టర్‌ స్థాయి పోలీస్‌ అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకోవటమే కాక పోలీసేతర అధికారులను శిక్షణ ఇచ్చి తీసుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సి.బి.ఐ. అకాడమీ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సి.బి.ఐ.లో పని ఎక్కువగా ఉన్నా అధికారుల సంఖ్య తక్కువగా ఉంది.

నత్తనడకన పరిశోధనలు, దశాబ్దాలుగా పెండింగ్‌ కేసులు
గత దశాబ్ద కాలంగా కోర్టు పెండింగ్‌లో ఉన్న సిబిఐ పరిశోధనా కేసుల సంఖ్య 2272కు చేరింది. 2008లో 991, 2009లో 1119, 2010లో 1009, ప్రస్తుత సంవత్సరం ఇప్పటివరకు 500పైగా గత మూడేళ్ళలో 3621 కేసులను నవెూదు చేసింది. నవెూదవుతున్న కేసులను చూస్తే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులపై 2008లో 595, 2009లో 654 , 2010లో 559, ఈఏడాది జూన్‌ నాటికి 481 కేసులు నవెూదయ్యాయని సంబంధిత మంత్రి ప్రకటించడం జడలు విప్పిన అవినీతికి, చోద్యం చూస్తున్న సిబిఐ పని తనానికి నిదర్శనం. కాగా 2008లో 1127, 2009లో1127, 2010లో 1173 ఈ ఏడాది జూన్‌ నాటికి 434 కేసుల పరిశోధన పూర్తివ్వగా చాలా కేసుల్లో తీర్పు రావాల్సి ఉంది. మరి ఈ కేసులపై న్యాయస్థానాలు ఇంకెన్నేళ్ళకు తీర్పునిస్తాయో వేచిచూడాల్సిందే.