నేటి ఫ్యాషన్ ప్రపంచంలో కుర్రకారు దుస్తులకే కాదు...
కళ్లకు ధరించే అద్దాలు, నడుంకి పెట్టుకునే బెల్టులు, చెవి రింగులు, కాళ్లకి వేసే చెపðలు...
చేతికి ధరించే బ్రాస్‌లెట్లు, గడియారాలకీ అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు.
వారి అభిరుచి తగ్గట్లు నేడు అనేక రకాల వాచీలు మార్కెట్లోకి వచ్చేసారు..మారుతున్న కాలంతో పాటుగా...వైరుధ్యానికి పెద్ద పీట వేస్తూ... మార్కెట్‌లోకి ఏ కొత్త తరహా వెూడల్ వచ్చి నా కొని పెట్టుకోవా లన్న దృక్పధానికి రెడ్ కార్పె ట్ వేస్తూ దూసుకుపోతున్న నేటి యవతరం అనేక సరికొత్త సృజనతో రంగరించిన వస్తువులపై మక్కువ చూపుతోంది. అత్యా ధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవించి రోజు రోజుకూ దూసుకు వస్తున్న కొత్త కొత్త గడియారాలని చేతికి అలంకరించుకునేందుకు సిద్దమవుతోంది.
ఒకపðడు ఇంట్లో ఒకరికో ఇద్దరికో వాచీలుండేవి. అదీ ఏబొడ్లోనో దోపుకుని సమయం చూసుకునేవారు. కాల క్రమంలో జరిగిన మార్పులు పురుషులు, మహిళలకు వేర్వేరుగా వాచీలు రావటంతో వీటి వాడకం బాగా పెరిగింది.
అయితే సాంకేతిక విప్లవం అందుబాటులోకి వచ్చాక 'కీ' ఇచ్చే వాచీల స్ధానంలోకి బ్యాటరీ సాయంతో నడిచే వాచీలు రంగ ప్రవేశం చేయ టంతో కారు చౌకగా సామాన్యజనం కూడా కొను క్కునేలా వాచీలు తయారై అందుబాటులోకి వచ్చాయి
చిన్న పిల్లాడి నుండి పండు ముదసలి వరకు ఎవరి అభి రుచికి తగ్గట్టు వారికి వాచీలు అందించడానికి అన్ని కంపెనీలు సిద్ద పడ్డాయి. ఈ క్రమంలో ఏ ఐదేళ్లలో ఒకసారో వాచీలు మార్చేందుకు ఇష్టపడే సామాన్యుడి ఇళ్లలో కూడా విభిన్నతకి పెద్ద పీఠవేస్తూ... డజన్లకొద్ది, సమయానికి, డ్రస్‌కి తగ్గట్టుగా వినియోగించేందుకు వీలుగా వాచీలు కొను గోలు చేస్తున్నారన్నది వాస్తవం.
దాదాపు అన్ని కంపెనీల వాచీలకు సినీ తారలని బ్రాండ్ అంబాస ిడర్‌లుగా వ్యవహరిస్తుండటంతో కుర్రకారు వీటి కొనుగోళ్లకి మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో వాచీల ధరలు కాసింత ఎక్కువగా పెరుగుతు న్నా...వెూడల్ నచ్చితే చాలు ఎంత ధరైనా కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.
ఇందుకు తగ్గట్టుగానే యువత స్పందనల్ని పరిగణలోకి తీసుకుని అనేక రకాల డిజైన్లలో, అనేక వెూడల్స్‌తో ఆకర్షించేలా అన్ని కంపెనీలు చేతి గడియారాలని మార్కెట్‌లోకి తీసుకొస్తునే ఉన్నాయి.
సెల్‌లో వాచ్ ఉన్నా సరే...
ప్రస్తుతం ఏ చేతిలో చూసినా సెల్ ఫోన్ కామన్ అయి పోయి న క్రమంలో ఇంకా చేతి వాచీ ఎందుకులే అని అనుకునే వారిని సైతం కొనుగోలు ఆసక్తి చూపుతున్నారు. ప్లాస్టిక, మెటల్, గోల్డ్, ప్లాటినం కోటింగ్‌లతో వివిధ రకాల చైన్‌లతో, పూసలతో అనేక వాచీలని రూపొందిస్తున్నారు. డిజిటల్ మాయాజాలంతో వైవిధ్య భరితమైన అనేక వెూడల్స్ అటు అమ్మాయిల్ని, ఇటు అబ్బాయిల్ని తెగ ఆకర్షి స్తున్నాయన్నది వాస్తవం. మరోవైపు ఇంటర్నేష నల్ కంపెనీలు కూడా బారతమార్కెట్ రంగం లోకి దిగి అనేక రకాల వాచీలను అమ్మకాని కి పెడుతున్నాయి. ఇవి ధరిస్తే... తమ స్టేటస్ మరింతగా పెరుగుతున్నట్లు భావిస్తున్న యువత వీటి కొనుగోలుకు ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ద పడుతున్నారు. ఇక చైనా నుండి దిగుమతి అవుతున్న అనేక వాచీలు చవక ధరల్లో లభ్యం అవుతుండటంతో చాలా మంది వాటి వైపు మెగ్గుచూపుతున్నారు.అవి ఓ సారి పాడైతే అంతే సంగతులు కావటం విచారకరమే అయినా రోజురోజుకీ వాటి అమ్మకాలు జోరందుకుంటున్నాయం టే సామాన్యుడిని ఎంతగా ఆకర్షిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. మార్కెట్‌లో లభిస్తున్న వివిధ వాచీలలో కాంతివంతమైన కలర్ డైల్ ఉన్నవాటికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. దీనికి తోడు సిల్వర్, గోల్డు, ఆరెంజ్, ఎల్లో, బ్లూ క్లాసి క సిల్వర్‌లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని.. ముి ళలు ఎక్కువగా గోల్డు, బ్లాక కలర్‌తో పాటు మల్టీ కలర్ స్ట్రాప్ ఉన్న వాటివైపే.. వివిధ రంగు రాళ్లు, గాజులలో వాచ్‌లు పొదిగిన వాటి పైనా.. మక్కువ చూపుతు న్నట్లు వాచ్‌షాప్‌ల యజమానులు చెప్తున్నారు. మణికట్టుపై మాయాజాలాన్ని చూపుతూ కనికట్టు చేసేలా రూపొందుతున్న ఈ చేతి గడియారాలు నేడు బహు మతుల లిస్టులో ప్రముఖ స్ధానం దక్కించుకుంది. మరి మీ మిత్రులకో, బంధువులకో మీరు జీవితాంతం గుర్తుండిపోయేలా చేతివాచీని బహు మతిగా అందించండి.