8, డిసెంబర్ 2011, గురువారం

వీళ్లూ..స్ఫూర్తి ప్రదాతలే...

 
అన్నీ సక్రమంగా ఉండి . లక్ష్యాలను నిర్ధేశించుకోలేక సతమతమవుతూ... ఎక్కడికక్కడ చతికిల్లపడుతున్న
నేటి తరాన్ని చూస్తుంటే బాధాకరంగానే ఉంటుంది. అయితే శరీరంలో ముఖ్య అవయవాలు లేకున్నా..
పుట్టుకతోనో ప్రమాదవసాత్తో కోల్పోయినా.. ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా... తమకంటూ ఓ ప్రత్యేకతని నిలుపుకునే క్రమంలో ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా... నిర్ధిష్ట లక్ష్యాలను ఛేదిస్తు.. తమ సత్తా చూపుతున్న వారు
ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో కొందరి గూర్చి కాసింత తెలుసుకుందాం...
విధి తమని చిన్న చూపు చూసినా... ఏమాత్రం అధైర్య పడకుండా....అవయవాల కన్నా ఆత్మస్ధైర్యమే ముఖ్యంగా
ముందుకు సాగుతు ప్రపంచ వ్యాప్తంగా నేటి తరాలనికి ఆదర్శంగా నిలుస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఎక్కడా తాము వికలాంగులమన్న భావన వ్యక్తం చేసుకోకుండా...ఎవరు తమని కించపరిచినా.. పట్టించుకోకుండా...
అన్నింటా... తమ సత్తా చూపుతూ దూసుకుపోతున్నవారిలో టామ్‌ విలియమ్స్‌, గేబ్‌ మార్ష్‌,కొడె మెక కాస్టండ,్‌ జోష్‌ సన్‌క్విస్ట్‌, వినోద్‌ ఠాకూర్‌, లూకాస్‌ సీథోల్‌ ఇలా ఎందరో...
టామ్‌ విలియమ్స్‌
కుడి చేతివైపు చేయి పూర్తిగా లేకున్నా... ఎడమ వైపున్న చిన్న పాటి చేతితోనే చక చకా తన పనులను ముగిస్తూ... బేస్‌ బాల్‌ మైదానంలో కాళ్లతోనేశాన్‌ డియాగో పడ్రేస్‌ ప్లేట్‌ త్రో గేమ్‌ని నేర్చుకుని అత్యంత వేగంగా పిచ్‌ ఆఫ్ట్‌ త్రోలో ప్లేట్‌ని విసరగల సమర్ధుడైన క్రీడాకారుడుగా ఎదిగాడు టామ్‌ విలియమ్స్‌. 20008లో జరిగిన పోటీలను ప్రత్యేక ప్రసారం చేసిన టివి ఛానల్‌లో చూసిన యావత్‌ ప్రపంచం ఆ పోటీలలో టామ్‌ విలియమ్స్‌ చూపిన ప్రతిభకు అచ్చెరువొందింది. టామ్‌ విలియమ్స్‌ని ప్రేరణగా చూపించాలని అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆయన అనేక పాఠశాలలు, కళా శాల విద్యార్ధులను కలిసి తన అనుభవాలను వివరించారుెూ వైపు క్రీడలో తన సత్తా చూపుతునే... మరోవైపు తన బాధ్యతగా సామాజిక చైతన్యం తీసుకొచ్చేందుకు స్వచ్ఛంధ సంస్ధలతో కల్సి కృషి చేస్తున్నా రాయన.
గేబ్‌ మార్ష్‌
ఎడ్‌, సెల్వా, న్యూబర్న్‌లో నిర్వహిస్తున్న దత్తత పిల్లల ఆశ్రమంలో పుట్టినప్పటి నుండే పెరిగాడు మార్ష్‌. చేయి లేకుండా పుట్టిన మార్ష్‌ని తల్లి దండ్రులు విడిచి పెట్టడంతో దాదాపు 60 మందిలో ఒకడిగా పెరుగుతునే... స్వీయ రక్షణ కోసం రక్షణ నిచ్చే ఎన్‌ మార్ష్‌ సావాసంతో ఈతని హాబీగా నేర్చుకున్నాడు.
ఈ క్రమంలో 2004లో గుంటెర్‌ సెల్వా సిమ్‌ టీమ్‌ నిర్వాహకుల దృష్టిని ఆకర్షించి దానిలో స్ధానం దక్కించుకున్న గేబ్‌ ఒంటి చేతితోనే ఈదుతూ... తన ప్రతిభా పాటవాలు మెరుగుపచుకుని, గత ఆరేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా డిజేబుల్‌ పర్సన్స్‌ గేమ్స్‌ ఎక్కడ జరిగినా పాల్గొంటూ.. అత్యంత వేగంగా ఈదే ఈతగాడిగా అందరి ప్రశంసలు పొందుతున్నాడు.
కొడె మెక కాస్టండ్‌
మెక కాస్టండ్‌కి పుట్టిన నాటి నుండి కాళ్ల ఎముకల్లో ధృఢత్వం కరువై పోవటంతో... 2001లో పూర్తిగా రెండు కాళ్లని కోల్పోవాల్సి వచ్చింది. 2003 వరకు ఎన్నో శస్త్ర చికిత్సలు జరిగినా ఫలితం లేక పోవటంతో చివరకి కొందరు వైద్యులు కృత్రిమంగా కాళ్లని అమర్చి పెట్టారు. ఈ క్రమంలో చిన్నప్పటి నుండి తనకిష్టమైన స్విమ్మింగ్‌, పరుగు పందాలని వదులుకోలేక వాటిపైనే మక్కువ ప్రదర్శిస్తుండటంతో ఆతనికి ప్రోత్సాహం కలిపిస్తూ... వైద్యులు కాలు స్ధానంలో చిన్న పాటి వంకీ ఉన్న కాళ్లని అమర్చారు. దీంతో మెక దశ మారిపోయింది.
నిత్యం, రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ... అటు స్విమ్మింగ్‌లోనూ తన ప్రతిభ చూపిస్తూ అనేక పోటీలలో పాల్గొన్నాడు. కేవలం ఐదేళ్ల వయసులో ఉన్నపðడే స్విమ్మింగ్‌, రన్నింగ్‌లలో బంగారు పతకాలను సాధించాడు. ఆపై యూఎస్‌లో జరిగిన పారా ఒలంపికలోేనూ తన ప్రతిభని ప్రదర్శించాడు.
ప్రస్తుతం 10 ఏళ్ల వయసున్న మెక నేడు ఛాలెంజ్‌డ్‌ అథలెటిక్స ఫౌండేషన్‌ ప్రవెూటర్‌లలో ఒకడిగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రసంగాలు చేస్తు... అంగవైకల్యంతో కుంగిపోవద్దన్న నినాదంతో దూసుకెళ్తు తన లాంటి అనేక మంది క్రీడాకారులకు అండగా నిలచే యత్నం చేస్తున్నాడు.
జోష్‌ సన్‌క్విస్ట్‌
తన తొమ్మిదో ఏట ఎముకల క్యాన్సర్‌ కారణంగా ఎడమ కాలిని కోల్పోయిన వ్యక్తి. 13 ఏళ్లు వచ్చే వరకు తన కాలుపై ఎన్ని శస్త్ర చికిత్సలు జరిగినా అదికరాదని తెల్సి కృంగి పోకుండా... తనకిష్టమైన స్నో స్కేటింగ్‌ లో తన ప్రతిభని చూపాలనుకుని ఆదిశగా ప్రయత్నించి సఫలమయ్యాడు.
మరోవైపు గాయకుడిగా, డాన్సర్‌గానూ రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకున్న క్విస్ట్‌ 2006 సం యుక్త పారా ఒలంపిక స్కై టీంలో సభ్యుడుగా కూడా వ్యవహరించి తన సత్తా చూపాడు. తన లాంటి వారి కోసం ఏదైనా చేయాలన్న తపనతో ఉన్న ఆయన ూవరర ుష్ట్రశఅ ఖీశీబతీ.శీతీస్త్ర పేరుతో ప్రత్యేకంగా ఓ వెబ్‌ సైట్‌ నిర్వహిస్తూ... ప్రపంచ వ్యాప్త వికలాంగులకు తన వ్యాసాలతో మానసిక ధైర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు.
జీబర్‌ ణశీఅ్ణ్‌ ఖీశశ్రీశ్రీ: నశీష ళి ్శతీవష ఖజూ, జశీఅనబవతీవస ళిశ్రీశ్రీఅవరర, శఅస వీశసవ ఱ్‌ ణశీషఅ ్‌ష్ట్రవ వీశీబఅ్‌శఱఅ ల పేరుతో పుస్తకాలను ప్రచురించి వచ్చిన నిధులు వికలాం గుల సంక్షేమానికి వినియోగిస్తు అందరికీ ఆదర్శంగా నిలుస్తు న్నాడు.
వినోద్‌ ఠాకూర్‌
భారత్‌లో పుట్టిన వినోద్‌ కాళ్లు లేకుండా పుట్టాడు. డాన్సుపై తనకున్న మక్కువ ఆతన్నిపðడు ఏకంగా డాన్సులో పెద్ద స్టార్‌ కాగలిగా డంటే దాని వెనుక ఆతని కృషి పట్టుదల ఎలాంటివో అర్ధం చేసుకోవచ్చు. స్రస్తుతం న్యూఢిల్లీలో చిన్న పాటి సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌ షాపు నిర్వహిస్తున్న వినోద్‌... చిన్నపðడు తనకి కాళ్లు లేక పోవటం... అందరిలా డాన్సు చేయాలని ఉన్నా చేయలేక దిగులు పడిన సందర్భాలు అనేకం ఉన్నాయని చెపð కొచ్చాడు.
అయితే ఇంటర్నెట్‌లో తనలా కాళ్లు చేతులు లేకున్నా ప్రతిభ ప్రదర్శిస్తున్న వారిని చూసి తానూ వారిలా ఎందు కు కాకూడదన్న తలంపుతో నిత్యం డాన్సుపై దృష్టి కేంద్రీ కరించి అవిరాళ కృషి చేస్తు...కేవలం 5 నెలల్లోనే చేతుల తోనే డాన్సు నేర్చుకున్నానని అనంతరం అనేక డాన్సు షోల పాల్గొన్నట్లు చెప్పాడు.
తొలిసారిగా గాట్‌ టాలంట్‌ పేరుతో జరిగిన టివిషోలో పాల్గొని రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు.
తనని తాను ఇనిస్టంట్‌ స్టార్‌గా చెపðకునే వినోద్‌ ఇపðడు తనలాంటి వికలాం గుల కోసం ప్రత్యేకంగా
ఓ డాన్సు స్కూలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం అభినందించాల్సిన విషయమే.
లూకాస్‌ సీథోల్‌
ద క్షిణాఫ్రికాకు చెందిన డిసేబుల్‌ క్రీడాకారుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న సీతల్‌.. 10 ఏళ్ల లేత వయసులోనే ఓ రైలు ప్రమాదంలో రెండు కాళ్లను ఓ చేతిని పోగొట్టుకున్నాడు. అయితే మొక్క వోని దీక్షతో మక్కువ ఉన్న టెన్నిస్‌ ఆటనే తన జీవన భాగం చేసుకుని వీల్‌చైర్‌ టెన్నిస్‌లో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చు కున్నాడు. డిజేబుల్‌ క్రీడాకారుడిగా సౌతాఫ్రికాలో నంబర్‌ 1 ఆటగాడిగా ఉన్న ఆయన ప్రపంచంలో 16వ స్ధానం దక్కించుకు న్నాడు. యంగ్‌లయన్‌గా పిలిపించు కు నే సీధోల్‌ ప్రపంచంలో 10వస్ధానంలో నిలవాలన్న ఆశయంతో ఆదిశగా కృషి చేస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలో గౌతంగ్‌ స్పోర్ట్‌ అవార్డుతో పాటు ఇయర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మాన్‌గా నిలచాడు. 1012లో లండన్‌లో జరిగే వీల్చైర్‌టెన్నిస్‌ ఛాంపియన్‌ షిప్‌ సాధించడమే తన ధ్యేయంగా చెప్పాడు.