8, డిసెంబర్ 2011, గురువారం

సంప్రదాయ కళకి సరికొత్త అందం టెర్రకోట

మట్టినే బొమ్మగా మలచి... బ్రహ్మ ప్రాణ ప్రతిష్ట చేసి మనిషిగా మలచాడన్నది మన భారతీయ సమాజ విశ్వాసం.
ఆ మట్టినే నమ్ముకుని.. రైతుగా, కర్షకుడులా, కార్మికుడిలా... కుమ్మరిగా...జన బాహుళ్యానికి సర్వం అందిస్తు
అపర బ్రహ్మగా పేరు సంపాదించేసుకున్నాడు ఏనాడో...తొలకరితో పులక రించిన నేల మట్టిని రైతు హత్తుకుని మురిసి.. కొత్త పంటలకు సిద్దమైతే.... ఆ మట్టినే మురిపెంగా లాలించి తన చేతుల కదలికలతో రూపాలనిచ్చి..
మట్టి బొమ్మలతో యావత్‌ మానవాళినీ సవ్మెూహితుల్ని చేసి... పరవశించిపోతాడు కుమ్మరి.
ఆతను సృష్టించిన రూపాలు మరుగున పడుతున్న క్రమంలో సంప్రదాయ కళకు కొత్త వన్నెలద్ది..
ఆధునికతను రంగరించి పుట్టిన మరో అద్భుత కళ ఃటెర్రకోటః అందాలనటంలో సందేహం లేదెవ్వరికీ...
ప్లాస్ట్టిక ప్రపంచాన్ని శాసించే స్ధాయికి చేరుకున్న ఈ క్రమంలో తనని తాను బతికించుకునే క్రమంలో సాంప్రదాయ కళలు ఆధునికతని మేళవించు కుని కొత్తఅందాలను సంతరించుకునేందుకు సిద్దమయ్యా యన్నది వాస్తవం. లోహపాత్రల స్ధానంలోమట్టి పాత్ర లు వాడే అవకాశాలున్నా మక్కువ చూపని జనంని తమ వైపు తిపðకుని సంస్కృతిని ప్రతిబింబ చేస్తూ... ఏదో తెలియని కొత్తదనం అను భూతిని కలిపించేలా చేస్తూ... తమని నెట్టేస్తున్న ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ధీటు గా ఎదుర్కొని,తాతముత్తాతల నుండి వచ్చిన సాంప్ర దాయంగా వస్తున్న కళను కాపాడుకునేందుకు యువతరం చేసిన కృషి ఫలితమే ఈ 'టెర్రకోట' అం దాలు. రాజస్ధాన్‌లో టెర్రకోట పేరుతో ఏకంగా ఓ ఊరే ఉందని...ఆ ఊరిలోనే ఈ బొమ్మల తయా రీ ఎక్కువగా జరుగుతోందని.. దాని వల్ల ఆ ఊరి పేరుతోనే ఈ బొమ్మల్ని పిలుస్తారని కొందరు చెప్తుంటారు. అయి తే అది వాస్తవం కాదు. టెర్రకోట అనే పదం లాటిన్‌ భాష నుండి పుట్టిందని కొందరు. ఇటాలియన్‌ నుండి పుట్టిందన్న వాదనలు ఉన్నా. ఎంద రికో ఉపాధిమాత్రం కలిపిస్తోందన్నది మాత్రం నిజం. టెర్రకోట అంటే కాల్చిన మట్టి అని అర్ధం. ముదురు మట్టి రంగు లో ఎరుపు, పసుపు వర్ణాలు జోడి స్తే..వచ్చే రంగులో ఉంటాయి. అయి తే ఆయా ప్రాంతాలలో మట్టి ప్రభా వం బట్టి కూడా కొత్త రంగులు సంతరించుకునే అవకాశాలు న్నాయి. ఒకపðడు మనం ఎర్ర పెంకులంటూ తెగసందడిచేసే వాళ్లం కదా దాదాపు అదే తరహాలో రూపొందే ఈ టెర్ర కోట మట్టిబొమ్మలు కుమ్మరి తిప్పె సారె చక్రంపై కాక పూర్తిగా చేతిపైనే ఆధారపడి చేస్తారు.
ప్రపంచానికి నాగరికత నేర్పిన మన భారతావనిలో ఈ టెర్రకోట మట్టి పాత్రలో సింధూ నాగరికతలో నే కనిపించాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పట ికే పురావస్తుశాఖ జరిపిన అనేక తవ్వకాలలో ఈ తరహా పాత్రలు బైట పడటం చెపðకోదగ్గ విషయం. ముఖ్యంగా మన దేశ ఉత్తర ప్రాంతంలో ఎక్కువగా టెర్రకోట వస్తువుల తయారీ నిపుణులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, మధ్య ప్రదే శ్‌, రాజస్ధాన్‌లతో కుటీరపరిశ్రమైన కుమ్మరి వృత్తికి బాసటగా నిలచిన ఈ టెర్రకోట నేడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తో సహా మిగిలిన ప్రాంతాలకూ విస్తరిం చింది. .
ఈ టెర్రకోట బొమ్మల్నే జీవనాధారం చేసుకుని రాజ స్ధాన్‌, ఉత్తర ప్రదేశ్‌లకి చెందిన ఎందరో కళాకారులు మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ప్రధా న రహదా రుల వెంబడి అనేక ప్రాంతాలలో సంచారజీవులుగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చిన్న చిన్న గుడా రాలను నిర్మించుకుని, అందులోనే నివశిస్తూ... ఈ బొమ్మల తయారీలో ఇంటిల్ల పాదీ పని చేస్తున్నారు. ఎక్కడో పుట్టి పెరిగిన తమను ఇక్కడి ప్రాంత ప్రజలు తమ వారిగా ఆదరిస్తున్నా... వ్యాపారార్ధం వివిధ ప్రాంతా లకు పయనం కావటం వల్ల తమ పిల్లలు సరైన చదువులేక నిరక్ష్యరాసులుగా మిగిలిపోవాల్సి వస్తోందన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. ఇంటిల్లపాదిలో పిల్లలు, పెద్దలు కల్సి తయారు చేసిన బొమ్మ లకు నగిషీలు చెక్కగా మహి ళలు చిన్న చిన్న తోపుడు బళ్లలో పెటు ్టకుని విక్రయాలు కొన సాగిస్తుండటం సర్వత్రా కనిపిస్తుంది. తమ చిన్నారులకు చదువు అందివ్వలేక పోతున్నా మన్న వేదన మినహా వారిలో సంస్కారం, క్రమశిక్షణ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.సమయ పాలనకి పూర్తిగా విలువనిస్తూ ఏమాత్రం సమయాన్ని వృధా చేయని రీతిలో నిత్యం ఈ టెర్రకోట బొమ్మల లో కొత్తదనాన్ని తీసుకురావటానికి ఎనలేని తపన పడే ఈ కళాకారులు తమ పూర్వీకులు చూపిన బాట లోనే నడుస్తూ... నేటి తరానికి తగ్గట్టు తమ వృత్తిని మార్చుకోవటం వల్ల ఉపాధికి ఢోకాలేకుండా పోయిందని చెప్పారు.
టెర్రకోట సైన్యం...
ఇపðడు మన కొత్త తరహా అందాలంటూ ఆనం దిస్తున్న ఈ టెర్రకోట ప్రక్రియని క్రీస్తు పూర్వమే చైనా లోని మన పూర్వీకులు ప్రారంభించారంటే ఆశ్చర్యం కలగక మానదు. మీరు చదివిందినిజమే... చైనాలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకా లలో ఈ టెర్రకోట సైన్యం బైట పడింది. క్రీööపూööచైనానుపాలించినకిన్‌షి యుమాం గ్‌ తన మరణా నంతరం కూడా జీవితం ఉంటుందని.తను చనిపోవటానికి ముందే ఏడు లక్షల మంది నిపుణులతో దాదాపు 38 ఏళ్ల పాటు శ్రమించి సమాధిని నిర్మింప చేసుకు న్నాడు. టెర్ర కోట ప్రక్రియలో రూపొందించిన గజతురగపదాతి దళాలు తమ ఆయుధాలతో సహా వెంట రాగా తన మరణం తరువాత కూడా ఆ పరి వారంతో జీవిస్తానన్న విశ్వా సంతో ఆయన ఈసమాధిని రూపొం దిం చుకున్నట్లు చరిత్ర చెపు తోంది.
ఈ క్రమంలోనే రిఓ ట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీ ఉపయోగించి ఈ సమాధిపై 90 అడుగు భవంతి నిర్మించారు. దీనిలో రాజుగారి ఆత్మ నిత్యం తిరుగుతూ ప్రజల బాగోగులు చూస్తుందని వారి విశ్వాసం. ఈ తవ్వ కాలలో బైట పడ్డ రక్షక దళాలలో 8 వేలకు పైగా సైనికుల బొమ్మ లున్నాయి. వీటిలో ఏ ఇద్దరు సైనికులు ఒకే రూపం లో లేరంటే... నాటి సైనిక వ్యవస్ధ ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చని నిపుణులు చెప్త్తారు. ఇటీవల జరిగిన తవ్వకాలలో బైట పడ్డ ఈ సమాధి ఎన్నో కొత్త విషయాలను, నాటి రాజరిక వ్యవస్ధపై ఎన్నో సమాధానాలను చెపుతోంది.
టెర్రకోట బొమ్మలు చేసేదిలా...
చెరువు నుండి, కుంట నుండి సేకరించిన మెత్తని బంకమట్టిని మరింత మెత్త బరిచి... దానికి తగు పాళ్లలో సన్నని ఇసుకని కలిపి కాళ్లతో బాగా తొక్కి బొమ్మలు తయారీకి అనువుగా తయారు చేసుకొంటారు. పూర్వం కుమ్మర్లు వాడే సారెలాంటి చక్ర్రాలు పై ఈ మట్టిని ఉంచి అది తరుగుతుండగా.. కావాల్సిన రీతులలో బొమ్మలని రూపొందించుకుని వారం రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. ఆపై వాటిని కుమ్మరి బట్టీలలో కాల్చేందుకు తీసుకువెళ్తారు.ఇలా కాల్చేం దుకు సాధా ణంగా ఉప యోగించేకల ప,ఊకస్ధానంలో కొబ్బరిమట్టలు, ఎండు కలప,యూకలెప్టిస్‌ ఆకు లు తదితరాలు వాడతారు. బొమ్మ గట్టిదనం, కావాల్సిన రంగుల ఆధారంగా ఈ కాల్పు ఉంటుంది. మట్టి లోని ఐరన్‌ ఆక్సైడ్‌శాతం అనుసరించి ఆరెంజ్‌, ఎరు పు, గోధుమ వర్ణాలలో ఈ బొమ్మలు తయారవు తాయి. మరీ నలుపు దనంగా బొమ్మలు కావాలను కుంటే బొమ్మల్ని మరో రోజు అదనంగా ఈ బట్టీల లో ఉంచుతారు. అయితే కొన్ని ప్రాంతాలలో లభ్యమ య్యే మట్టి కారణంగా పసుపు, గులాబీ, బూడిద వర్ణాలుగా కూడా బొమ్మలు తయారై కొత్త అందా లను సంతరించుకుంటాయి. ఇలా బట్టీల నుండి తీసుకువచ్చిన బొమ్మల ఆకారాలకు కాసిన్ని రంగు లు, ఇతర నగిషీలు చేసి అమ్మకానికి సిద్దం చేస్తారు.
నేడు చిన్న చిన్న గ్రామాలలోని ఇళ్లలో సైతం టెర్రకోట బొమ్మలు దర్శన మిస్తున్నాయంటే... జనం వీటిపై ఎంతలా మక్కువ ప్రదర్శిస్తున్నా రో అర్ధం చేసుకోవచ్చు. తొలి నాళ్లలో కేవలం పూల మొక్కల పెంపకానికి వాడే కుండీలను మాత్రమే టెర్రకోటలో తయారు కాగా నేడు అనేక రూపాలు సంతరించుకుని కనువిందు చేస్తున్నాయి.
టెర్రకోట మట్టితో తయారైన బొమ్మల్లో పులులు, సింహా లు, ఏనుగులు, గుర్రా లు, కోతులు, లాంటి బొమ్మలనే కాదు అనేక దేవతామూర్తులను, గృహా లంకరణ వస్తువులతో అలరిస్తున్నాయి. చిన్న పట్టణాలలో జరిగే హస్త కళా ప్రదర్శనలలో నేడు టెర్ర కోట అందాలు ఆకర్షిస్తూ.. అధిక శాతం అమ్ముడు పోతున్నాయి.
టెర్రకోటకు కేరఫ్‌లు...
టెర్రకోట అందాలకి ముందుగా గుర్తొచ్చేది రాజ స్ధాన్‌లోని మొయోలానే..ఇక్కడి వారి ద్వారానే ప్రపం చానికి ఈ కళ పరిచయమైందని చెప్తారు. మట్టి పాత్రలకు నగిషీలు చెక్కి,రంగులు వేసి ఆకర్షణీ యం గా తయారు చేయటంలో వీరు సిద్దహస్తులు. ఇక టెర్రకోట అశ్వాలంటే ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌ పూర్‌దే పేరు. అలాగే ఆరు మీటర్ల ఎత్తున్న టెర్రకోట గుర్రాలను రూపొందించడంలో తంజావూరు కళాకా రులు పెట్టింది పేరంటే ఆశ్చర్యం కలగక మానదు.
బొమ్మలకే పరిమితం కాదు..
ఏనుగులు, గుర్రాలు, మట్టి పాత్రలకే టెర్రకోట అందాలు పరిమితం కాలేదు. నేటి ఆధునిక యువ తని దృష్టిలో ఉంచుకుని కొత్త పుంతలు తొక్కుతోంది. మట్టితో రూపొందించిన అనేక రకల నగలు నేడు యువతరాన్ని ఆకర్షిస్తూ.. ధరించేందుకు మక్కువ ప్రదర్శించేలా ఉన్నాయి. జ్యూలరీని తయారు చేసేం దుకు టెర్రకోట కళాకారులు ప్రత్యేక శ్రధ్ద కనిపి స్తున్నారు. మట్టిలో గొలుసులు, లోలాకులు తయారు చేయటమే కాకుండా వాటికి బంగారపు పూతలా
కనిపించే రంగుల్ని అద్దుతూ తక్కువ రకం రత్నాలని పొదుగుతూ.. కొత్త తరహా ఆభరణాలకు శ్రీకారం చుట్టారు. సాంప్రదాయ పద్దతులకు అనుగుణంగా రూపొందుతున్న ఈ నగలు పార్టీ జ్యూలరీలంటూ ప్రత్యేక సందర్భాలలో వీటిని ధóరించేందుకు ఎక్కువ గా ఇష్టపడుతున్నారు జనం.
కుటీర పరిశ్రమని దాటి...
కుటీర పరిశ్రమని దాటి పారిశ్రామిక స్ధాయిలో అభివృధ్ధి చెందుతున్న టెర్రకోటపై ప్రభుత్వా లు కూడా దృష్టి పెట్టాయి. ఇందుకు అను గుణంగా అనేక చోట్ల మట్టిని కలి పేందుకు..చేసిన బొమ్మలు కాల్చేం దుకు అనేకయూనిట్లు వెలిసాయి. కోల్‌ కత్తాలోని గంగా నది తీరం లో టెర్రకోటబొమ్మల కోసం ఏకం గా పెద్ద యూనిట్‌ ఏర్పాటైంది. ఇది మన దేశంలోనే అతి పెద్దది కావటం విశేషం.
లాభాలూ బొలెడు...
టెర్రకోట వస్తువులు సాధారణ మట్టి పాత్రల కన్నా భిన్నంగా ఉంటాయి. పర్యావరణకు ఎలాంటి విఘాతం కలిగించని ఈ వస్తువులు పింగాణీ పాత్రల్లా కనిపించడమే కాకుండా గీతలు పడే ఆస్కారం తక్కువ, తేలికగా శుభ్రపరుచుకునే అవకాశా లున్నాయి. పూలకుండీలనుంచి టీకపðల వరకు సాంప్రదాయ రీతులు ఉట్టి పడేలా రూపొందు తున్న ఈ టెర్రకోట పాత్రలు మైక్రో ఒవెన్‌లలోనూ వాడుకు నేందుకు ఇబ్బంది లేక పోవటం, పగిలి పోవటం తదితరాలు తక్కువగా ఉండటం వల్ల అనేక మంది వీటిని నిత్య జీవితంలో వినియోగించేందుకు మక్కువ చూపుతున్నారు.
అందాలొలికిస్తూ...
మన ప్రాచీన నాగరికతలైన గ్రీకు నాగరి కతలో విస్తరించిన ఈ టెర్రకోట ఆధునిక ఐరాపా దేశాలలోనూ కనిపిస్తుంది. ఇక మన కోల్‌కత్తా సమీపంలో ఉన్న విష్ణుపురి ఆలయం పైభాగంలో నెల వైన టెర్రకోట టైల్స్‌ సందర్శకులను కట్టి పడస్తుంటాయి. వందల సంవత్సరా లు గడుస్తున్నా.. ఇవి ఏ మాత్రం చెక్కు చెదరలేదంటే వాటి నాణ్యత ఏపాటిదో అర్ధం చేసుకో వచ్చు. అలాగే లండన్‌లోని బర్నింగ్‌ హౌం భవంతిలోనూ టెర్రకోట టైల్స్‌ కనిపిస్తాయి మనకి.ఏది ఏమైనా మన ప్రాచీన కళా సంపద నేడు దిన దిన ప్రవర్ధమా నంగా వెలుగొందుతుండటంతో మనం కూడా అండదండగా నిలవా ల్సిన అవసరం ఎంతైనా ఉంది.