4, డిసెంబర్ 2011, ఆదివారం

కళని”ఒడిసి”పట్టి బుద్ధిమాంద్యం జయించి..

మానసిక బుద్ది మాద్యం తనని బాధిస్తున్నా... దానిని అధిగమించి.. ఒడిస్సీ నాట్యంలో తనకో ప్రత్యేకత నిలుపుకుని నేడు నేషనల్‌ అవార్డు గ్రహీతగా నిలచింది ఒరిస్సా రాష్ట్రంలోని రూర్కెలాకు చెందిన రేష్మి రేఖా సాహు. 27 ఏళ్లు వచ్చి వనితలా ఎదిగినా... కేవలం 12 ఏళ్లు కూడా మించని...చిన్నారిలా కనిపించే ఆమె కేవలం నృత్యంలోనే కాదు, గాయనిగా, క్రీడాకారిణిగా ప్రతిభ చూపిస్తు ఎందరికో ఆదర్శవంతంగా నిలుస్తోంది.
మానసిక బుద్ది మాద్యం తనని బాధిస్తున్నా... దానిని అధిగమించి.. ఒడిస్సీ నాట్యంలో తనకో ప్రత్యేకత నిలుపుకుని నేడు నేషనల్‌ అవార్డు గ్రహీతగా నిలచింది ఒరిస్సా రాష్ట్రంలోని రూర్కెలాకు చెందిన రేష్మి రేఖా సాహు. 27 ఏళ్లు వచ్చి వనితలా ఎదిగినా... కేవలం 12 ఏళ్లు కూడా మించని చిన్నారిలా కనిపించే ఆమె కేవలం నృత్యంలోనే కాదు, గాయనిగా, క్రీడాకా రిణిగా ప్రతిభ చూపిస్తు ఎందరికో ఆదర్శ వంతంగా నిలుస్తోంది.
మానసిక వికలాంగురాలిగా రూర్కెలా లోని ఉక్కు కర్మాగారంకి చెందిన టౌన్‌ సేవావిభాగం నేతృత్వంలో నడుస్తున్న శిక్షణాలయంలో నృత్యంలో శిక్షణ పొంది.. ప్రదర్శనలు ఇచ్చే స్ధాయికి ఎదిగిన రేష్మి దేశంలోని వివిధ ప్రాంతా లలో తన ప్రతిభాపాటవాలు చాటుకుంది. చిన్నతనం నుండి రూర్కెలా కేంద్రంగా నడుస్తున్న హూప్‌ స్వచ్చంధ సంస్ధ కేంద్రం లోనే విద్యాబ్యాసం చేస్తుిన్న సమయంలోనే నృత్యంలోనూ, క్రీడల లోనూ ఆమెకున్న ఆసక్తిని గమనించిన ఆ సంస్ధ ఆయా రంగాలలో ప్రోత్సహించారు. ఈ క్రమంలో ఆమె జాతీయ స్ధాయిలో అనేక అవార్డులు, రివార్డులు దక్కించుకొని ప్రతిభాపాటవాలకు అంగ వైకల్యమే కాదు మానసిక వైకల్యం కూడా అడ్డుకాదని నిరూపించింది.
నృత్యంలో అవార్డులు...
శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన రేఖాసాహు 1999లో ఉత్సవ్‌- 1999 జాతీయ పండగలలో పాల్గొని నృత్య, సంగీత విభాగంలో బహుమతులు గెలుచుకుంది. 2000లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్ధాయి నృత్య పోటీలలో పాల్గొని తన ప్రతిభతో అలరించి హైదరాబాద్‌ ఉత్సవ్‌అవార్డు దక్కించుకుంది.ఆపై క్రీడలను, నృత్యం లోనూ సమాంతర ప్రాధాన్యత ఇస్తూ..ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ఆమె ప్రతిభని గుర్తించిన భారతీయ రెడ్‌ క్రాస్‌ సొసైటీ 2006లో ఉత్కల్‌ దివస్‌ సందర్భంగా ప్రత్యేక పుర స్కారం అందించి సత్కరించింది. ఈ సందర్భంగా రేష్మి కి 5000 రూపాయల క్యాష్‌ అవార్డుతొ పాటు కత్తి, డాలు అందించారు.
అలాగే కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఏటా అందించే జాతీయ ట్రస్ట్‌ అవార్డుని 2007లో దక్కించుకుందామె. విభిన్న ప్రతి భా పాటవాలను తానున్న స్ధాయికిమించి అందునా క్రీడలు, నృత్యా లలో ప్రదర్శిస్తున్నందుకుగాను ఆమెని ఈ పురస్కారం వరించిం ది. దీనిని లోక్‌ సభ స్పీకర్‌ మీరాకుమార్‌ చేతులు మీదుగా అందు కున్నారామె. 2010లో జరిగిన జాతీయ పిల్లల పండగ (అంజలి ప్రోగ్రామ్‌) సందర్భంగా బహుళ రంగాలలో ప్రతిభ ప్రదర్శిస్తున్న వ్యక్తిగా గుర్తింపు దక్కించుకుని సమర్ధ మహిళా అవార్డు అందు కుంది రేష్మి. తాజాగా నేడు (డిశంబర్‌ 3) జరగనున్న ప్రపంచ మానసిక వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రతిభ గల మానసిక వికలాంగులకు అందించే అవార్డుని ఈ సారి రేష్మి దక్కించుకోవటంతో రూర్కెలాలో పండగ వాతావర ణం నెలకొంది. మానసిక వికలాంగురాలిగా అసాధారణ ప్రజ్ఞ చూపిస్తున్న రేష్మి ఈ అవార్డు అందుకోవటానికి అన్ని విధాలుగా తగినదని భావించి ఎంపిక చేసినట్లు ఇప్పటికే కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికాకత మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శి పంకజ్‌జోషి ప్రకటించారు. మానసిక అంగవైకల్యంతో బాధ పడుతూనే ఇతరులకు స్పూర్తినిచ్చేలా ప్రతిభ చూపించే మహిళల వర్గంలో ఈ 27 ఏళ్ల రేష్మిని ఎంపిక చేసినట్లు తెలిపారామె. డిశంబర్‌3న ఢిల్లీలోని విజ్ఞ్‌ాన్‌భవన్‌లో జరిగే ప్రపంచ డిజేబుల్‌ డే ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ చేతులు మీదుగా రేష్మి ఈ జాతీయ అవార్డు అందుకోనున్నారు.
ఆటలలోనూ పతకాలు...
అలాగే ఆటలలో తన సత్తా ప్రదర్శిస్తూ 2005లో న్యూఢిల్లీలో ప్రత్యే క ఒలంపిక్‌ క్రీడలు నిర్వహించగా... ఆ పోటీలలో పాల్గొని 100 మీటర్ల పరుగు పందెంలోనూ.. స్వర్ణ పతాకాన్ని చేజిక్కించుకోవట మే కాక 50 మీటర్లు 100 మీటర్ల నడక పోటీలలో పాల్గొని రజిత పతకాన్ని దక్కించుకుందామె.

ఆనందానికి హద్దేలేదు
రేష్మి చిన్నతనంలో సాధారణంగా ఉన్నా వయసు పెరుగు తున్న కొలది ఆమె బుద్ది మాద్యానికి లోనవుతున్న విష యాన్ని గమనించా... అమ్మగా మాటలు కూడా సరిగా పలకలేని బిడ్డని చూసి తల్లడిల్లిపోయి... ఏడ్చిన రాత్రులు చాలా ఉన్నాయి. కన్న మమకారం ఆమెని దగ్గరకు తీసు కుని ఏది ఏమైనా పెంచి పెద్ద చేయాలని నిర్ణయించుకున్న సందర్భంలో హూప్‌ సంస్ధ నాకు అండగా నిలచింది. రేష్మి పరిస్ధితి చూసి తమ వద్దే ఉంచుకుని చదువు తదితరాలు చెప్పించేందుకు ముందుకు రావటం నాకు కాస్త ఊరట నిచ్చింది. ఏళ్లు గడుస్తున్నా... ఇంకా చిన్న పిల్లలానే మనిషి ఉండిపోవటం ఆ తీరుగానే ప్రవర్తించడం ఓ వైపు ఆందోళ న కలిగిస్తున్నా... ఆటలలో నృత్యంలో శిక్షణ పొంది జాతీయ స్ధాయిలో అవార్డులు సొంతం చేసుకున్నప్పుడు అమ్మగా అక్కున చేర్చుని మళ్లీ ఏడ్చిన సందర్భమూ ఉం ది. తాజాగా మరో మారు రాష్ట్రపతి చేతుల మీదుగా అవా ర్డు తీసుకోబోతోందని తెల్సి మనసు చేస్తున్న ఆనందానికి హద్దే లేకుండా పోతోంది.  - శుభాంగి సాహు, రేష్మి తల్లి
అందరికీ ఆదర్శమే...
మానసిక వికలాంగురాలిగా అసాధారణ రీతిలో అమె అందుకుంటున్న విజయాలు అనితర సాధ్యమనిపిస్తోంది. కృషి చేస్తే చేయలేనిది ఏదీ లేదనటానికి నిలువెత్తు నిద ర్శనం రేఖా సాహు అని చెప్పక తప్పదు. దాదాపు 20 ఏళ్ల పాటు మా సంస్ధలోని విద్యా కేంద్రంలో ఉంటూ శిక్షణ పొందిన ఆమె నిష్ణాతురాలైన ఒడిస్సీ కళాకారిణిగా రూపొందటమే కాకుండా..క్రీడాకారిణిగా కూడా తన ప్రత్యే కత నిరూపించుకుంది.
ఆమెని అన్ని విధాలా ముందుకు తీసుకు వెళ్తేందుకు ఆమె తల్లి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఆమె ప్రతిభ కార ణంగానే నేడు మా సంస్ధ పేరు కూడా జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకోవటం ఆనందంగా ఉంది. మరిన్ని విజ యాలు అందుకొనే సత్తా తనలో ఉందని ఆమె మొక్కవోని ఆత్మస్ధైర్యం యువతరానికే కాదు అందరికీ ఆదర్శమవు తుందనటంలో సందేహమే లేదు... - నారాయణ్‌ పాటి, హూప్‌ కార్యదర్శి, రూర్కెలా...