4, డిసెంబర్ 2011, ఆదివారం

నాద నీరాజనం

కళలతో పండిత పామరులనే కాదు... భగవంతుడిని కూడా ఓలలాడించి సాక్షాత్కరింప చేసుకోవచ్చన్నది నమ్మకం. ఇందుకు నృత్యం, గానం, సంగీతం ఇలా అనేక కళా రూపాలతో భగవంతుడిని ఆరాధించి, మెప్పించి.. ప్రసన్నం చేసుకుని వరాలందుకున్నట్లు మన పురాణాలలో అనేక కధలు కూడా ప్రచారంలో ఉన్నాయి. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సాంప్ర దాయాన్ని కొనసాగిస్తూ... భాష ఏదైనా... లక్షలాది మంది కళాకారులు తమ కళను దేవుని సన్నిధిలో ప్రదర్శించి ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు పొందాలని ఉత్సాహం చూపిస్తారు. అందునా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుని పాదా ల చెంత తన కళను ప్రదర్శించి ఆ దేవ దేవుని కృపకు పాత్రులు కావాలని పరితపించే వారు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అలాంటి కళాకారుల కోసమే 'నాదనీరాజనం' ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్ధానం.
ఆన్నమయ్య తన పద కవితల గానంతో వెంకటేశ్వ రుని మైమరిపించి కైవల్య ప్రాప్తి పొందగా... వెంగ మాంబ కూడా అదేస్ధాయిలో సంకీర్తనలతో ఏడుకొం డల స్వామిని స్తుతించి...ఆయనలో లీనమైంది. ఇలా కళా రూపా లకు కళాకారులకు సాక్షాత్తు ఆ భవంతుడే పెద్దపీట వేయటం జరిగిందన్నది వాస్తవం. ఈ క్రమం లోనే భగవంతుని సాన్నిధ్యంలో కళారూపాల ప్రదర్శ నకు వీలు కల్పిస్తూ... తిరుమల తిరుపతి దేవస్ధానం చేపట్టిన అద్భుత కళాపోషక వేదిక 'నాద నీరాజనం'.
ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఎన్ని సంపా దిం చినా... ఆ దివ్య మంగళరూపం చెంత తమ ప్రతిభని ప్రదర్శించాలనుకునే వారికి నాద నీరాజనం మంచి వేదికగా నిలుస్తోందనటంలో సందేహం లేదు. ఎందరో మహాను భావులు తమ కళా నైపుణ్యాన్ని కలియుగ దైవం శ్రీనివాసుని పాదాల చెంత ప్రదర్శించేం దుకు ఉవ్విళ్లూరు తున్నారు ప్రపంచ ప్రఖ్యాతి గాం చిన కళాకారులెం దరో నాదనీరాజనం వేదికపైన తమ నృత్యంతో, గానంతో, వాయిద్యాలతో పాటు అనేక నాటకాలు, పద్య ప్రదర్శనల నొసంగి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించారు.
పుట్టిందిలా...
తిరుమల గిరులన్నింటినీ కలిపి మహా ప్రాకారం నిర్మాణం చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం అడ్డంకి వస్తున్న వేయి కాళ్ల మండపాన్ని దశాబ్ధకాలం క్రితం తొలగించిన తితిదే... అనేక విమర్శలకు నోచుకొంది. ఆ క్రమంలో జరిగిన అనేక పరిణామాల కారణంగా మహాప్రాకార నిర్మాణానికి స్వస్తి పలకడం మంచిదన్న అనేక మంది సూచనల మేరకు నిర్ణయం తీసుకున్న తితిదే.. వేయి కాళ్ల మండపం తొలగింపు ద్వారా శ్రీవారి ఆలయ మహాద్వారం ఎదు ట సువిశాలమైన ఖాళీ ప్రదేశం ఏర్పడటం.. ఇది బ్రహ్మౌ త్సవాలలో పాల్గొ నేందుకు వస్త్తున్న భక్తులకు ఎంతో సౌకర్యం ఉండటంతో.. ఆ ప్రాంతంలో సేద తీరుతున్న అనేక మంది భక్తులను నిత్యం అలరిం చేలా
సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని.. అనేక మంది అభిప్రా యం మేరకు భక్తిరస పూర్వకకార్య క్రమాల ను అందించేందుకు ఇక్కడ ఓ వేదికను రూపొందించాలని నిర్ణయించింది.అప్పటివరకు తిరుమల లో ఆస్ధాన మండపంలో జరిగే భక్తిరస ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు ఇబ్బంది పడుతుం డటంతో...శ్రీవారి మహాద్వారం సమీపం లో మండప నిర్మాణం అనువైన ప్రదేశ మని అప్పటికార్యనిర్వహాణాధికారి రమణా చారికృషితో మండపం ప్రారంభిం చి కార్యరూపం దాల్చాంచింది.
ఈ క్రమంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి సహకారంతో.. 20అడుగుల వెడల్పు 40 అడుగుల పొడవు, 50 అడుగుల ఎతుతో భారీ మండప నిర్మాణం చేపట్టి, పూర్తి చేసింది. ఇందులో శ్రీవారి నిలువెత్తు విగ్రహంతో పాటు అన్నమయ్య, త్యాగరాజు, బీబీ నాంచారి, వెంగమాంబ, శ్రీకృష్ణ దేవరాయలు తదితరుల విగ్రహాలను ఏర్పాటు చేసి అత్యంత శోభాయయానంగా తీర్చిదిద్ది. 2009 సంవత్సరం ఆగష్టు 15న మండ పంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్ధానం. ఆనాటి నుంచి ప్రతి సాయంత్రం వేళలో ్లఅనేక భక్తిరస కార్య క్రమాలునిర్వహిస్తున్నారు. వేలాది మంది కళాకారులు తమ ప్రతిభానైపుణ్యం ప్రదర్శిం చారు నాదనీరాజన మండపం ప్రారం భించిన నాటి నుండి 800 పైగా కార్యక్రమాలు జరిగాయి.
ఎందరో కళాకారులు...
ఏ చానల్‌లోనూ ప్రసారం కాని కర్ణాటక, శాస్త్రీయ సంగీతాలను సైతం నాదనీరా జనం వదికపై ప్రదర్శించారు. మొట్టమొదట తిరుపతికి చెందిన శ్రీవేంకటేశ్వర మ్యూజి క కళాశాల విద్యార్ధినులచే నాదస్వర కచేరీ ప్రారంభించి అదేరోజు 25మంది వయొలి న్‌ కళాకారులచే చెన్నైకి చెందిన కన్యా కుమా రి బృందం వాయిద్య సమ్మేళనం కచేరీ ఏర్పాటు చేశారు.తదుపరి ప్రఖ్యాతి గాం చిన కళాకారులు సారపల్లి రంగనాధం, పద్మశ్రీ కదిరి గోపాల్‌నాథ్‌, నది మారు కల్యాణరాం నామ సంకీ ర్తన, టి.టి.డి, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌, బెంగుళూరు కు చెందిన సుకన్య రాజగోపాల్‌, విట్టల్‌దాస్‌ మహారాజ్‌, టి.యం, కృష్ణ గాత్ర కచేరీ, మాంబలం సిస్టర్స్‌ గాత్రం, విజయసింహ గాత్ర కచేరీ, ద్వారం లకి్ఝ, ఉన్నికృష్ణన్‌, బెంగుళూరుకు చెందిన పద్మభూషణ్‌ హరిప్రసాద్‌ చౌరాసియా, బొంబాయి సిస్టర్స్‌, పదుక్కటై ఆర్‌.కృష్ణమూర్తి, తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాగా, ఇండోనేషియాకు చెందిన విదేశీయులు బాలి రామాయణ నృత్యరూపక కావ్యాన్ని 2010 ఆగష్టు 15న ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా ప్రదిర్శించారు. వీరేగాక యల్లా వేంకట ేశ్వరరావు తన మృదంగ వాయిద్య కచేరీతో భక్తు మనస్సులను దోచా రు. హైదరాబాద్‌ సిస్టర్స్‌ గాత్రం, ప్రముఖ నర్తకి శోభానాయుడు బృం దం కూచిపూడి నృత్యరూపకం 2010జనవరిలో 2009 డిశంబరులో సినీనటి మంజుభార్గవి నాదనీరాజ నం వేదికపై తన నృత్య ప్రదర్శనతో భక్తులను మైమర పింపచేసింది.2009 అక్టో బరు 31న పద్మజారెడ్డి నృత్యం, ద్వారం దుర్గా ప్రసాదరావు, కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణవంటి ఎందరో ప్రతి భావంతుల తమ ప్రతిభను ప్రదర్శించారు.
కళాకారుల ఎంపిక ఇలా...
నాదనీరాజనం వేదికపైన అన్ని భాషలకు చెందిన కళాకారులు తమ భక్తిరస భావ ప్రదర్శనలను ప్రదర్శించారు. ప్రదర్శనలు నిర్వహించడా నికి వీరిలో టి.టి.డి, మాజీ కార్యనిర్వహణాధికారి సీనియర్‌ ఐ.ఏ.ఎస్‌. అధికారి పి.వి.ఆర్‌.కె.ప్ర్రసాద్‌ ఛైర్మన్‌గా కమిటీని నియమించింది. ఆల్‌ఇండియా రేడియో నిర్ణయించిన గ్రేడ్‌ కళాకారులకు, ప్రదర్శనలో ప్రాముఖ్యత కల్పిస్తునే... ప్రదర్శనలు అన్నీ భక్తిరస భావం పెంపొం దించి సాంప్రదాయ బద్ధంగాఉండాలని నిర్ణయించారు.
నాద నీరాజనం వేదికపై ప్రదర్శించే కళాకారులు తమ ప్రదర్శన కోసం సంబంధిత సి.డి.ని గ్రేడుధృవీకరణ పత్రాలను నాదనీరాజనం, భక్తి ఛానల్‌, అలిపిరి అతిథిగృహం తిరుపతి చిరునామాకు పంపితే కార్యా లయానికి వచ్చిన వాటిలో రెండు నెలలకొక పర్యాయం కమిటీ సమా వేశం జరిపి, పరిశీలించి అర్హత కలిగిన వాటికి నాదనీరాజనం వేదిక పై ప్రదర్శించేందుకు అనుమతి మంజూరు చేస్తున్నారు. ప్రదర్శిన ఇచ్చిన కళాకారులకు వారి బృందాల ప్రకారం 50వేలు, 30వేలు, 20ాలుే, 15 వేలుగా తగిన పారితోషకం, అందచేయటమే కాకు ండా...శ్రీవారి దివ్య మంగళర్శనంతో పాటు ఉచిత భోజన వసతిని టి.టి.డి కల్పిస్తుంది. అనేక మంది ప్రఖ్యాత కళాకారులు శ్రీవారిసన్నిధి యందు నెలకొన్న నాదనీరాజనంలో ప్రదర్శిం చి దశదిశలా తమ కీర్తిని చాటుతున్నారు. ఈ కార్యక్రమాలు టి.టి.డి. ధర్మ ప్రచారపరిషత్‌ పఖ్యాత కళాకారులు శ్రీవేంకటే శ్వర భక్తి ఛానల్‌ సం యు క్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలకు టిటిడి భక్తి చానల్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా ప్రసారం చేస్తుంది. ఈ వేదికెపై ప్రదర్శన పొందాలంటే ఆ ఏడు కొండల వాడి దయ కావాల్సిందే అని ఆతృతగా వేచి చూస్తున్న కళాకారులు చాలా మంది ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.
కళలను కాపాడే వేదిక ఇది...
ఈ వేదికపై నుండి భారతీయ, సంస్కృతీ సాంప్రదాయాలను పరి రక్షించడమే కాకుండా సాంప్రదాయంగా అనాదిగా వస్తున్న కళలని ప్రోత్సహించడం,
ప్రజలలో భక్తి భావ న పెంపొందించడం ప్రధానంగా ఇక్కడ కళారూపాల ప్రద ర్శన జరుగు తోంది. అంతే కాకుం డా ఎన్నో వ్యయప్రయాశల కోర్చి తిరుమ ల వస్తున్న లక్షలాది భక్తుల ను ఆనందడోలికల్లో ఊపు తూ సాగే కర్ణాటక, హిందు స్ధానీ సంగీతం, అనేక మంది కళాకారు లు చేసే భజనలు, ప్రదర్శించే పౌరాణ ిక కళారూపాలు వారిని సేద తీరుసు ్తన్నాయనటంలో సందేహం లేదు. తితిదే. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌లు సంయుక్తగా ఎందరో కళాకారులను ప్రోత్సహిస్తు...వారితో ఇప్పిస్తున్న స్వర హారతే నాదనీరాజనంగాచెప్పక తప్పదు.