17, ఏప్రిల్ 2011, ఆదివారం

ఆ ముగ్గురిపై వేటుకు రంగం సిద్దం

గత కొంత కాలం గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, బాలనాగిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అనర్హత అంశంపై సాగాదీత ధోరణి కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎట్టకేలకు న్యాయనిపుణుల సలహాల తో వారిపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. పార్టీ గుడ్‌బై చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన పోచారం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న బాలనాగిరెడ్డి, ప్రసన్న కుమార్‌రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ డిప్యూటి స్పీకర్‌ను కోరిన విషయం తెలిసిందే...శాసనసభ స్పీకర్ గా ఇన్‌చార్జి హోదాలో ఉపసభాపతే విధులను నిర్వర్తిస్తున్నందున సభ్యుల అనర్హత వేటును పరిశీలించే అధికారంపై సందిగ్ధత నెలకొ నడంతో ఆదివారం న్యాయ నిపుణుల సహలను సేకరించారు ఆయన. కాగా కాంగ్రెస్స్ పార్టీ కి చెందిన నలుగురుపై వేటుకు రంగం సిద్దం చేసుకోన్నందునే.. తనపై విమర్శలు రాకుండా ఉండేందుకే ఉపసభాపతి.. వ్యూహాత్మకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు వినిపిస్తోంది