అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండుతో పాటు మరో నలుగురు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఐదురోజుల క్రితం ఇటానగర్ వెళ్తుండగా ఖండూ ప్రయాణిస్తున్న హెలీకాఫ్టర్ అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆర్మీ వర్గాలు ఖండూ ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు ప్రయాత్నాలు మొదలు పెట్టాయి. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా తవాంగ్లోని లోబ్తాన్ లో జంగ్ జలపాతం వద్ద కుప్పకూలినట్లు తెలుస్తోంది. దోర్జీఖండూ సహా అయిదుగురి మృతదేహాలు లభ్యం అయినట్లు, గుర్తుపట్టలేనంతగా, కుళ్లిపోయినట్లు తెలుస్తోంది. . కాగా దోర్జీఖండూ మృతిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు.