స్వరబ్రహ్మ'గా తెలుగు ప్రజల నుండి, 'తిరై ఇసై తిలగం'గా తమిళ ప్రజల నుండి ప్రశంసలు పొందారు కె.వి. మహదేవన్. మెలోడీ పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా ఆయన సంగీత దర్శకత్వం నెరపిన చిత్రాల్లో సమిశ్రమమై ఆ చిత్ర విజయానికి తోడ్పడేవి. పాటల కారణంగానే హిట్టయిన చిత్రాలే కాదు, పాటల కోసమే పదేపదే ప్రేక్షకులు సినిమాలు చూసిన సందర్భాలు కూడా ఎక్కువే అంటే అది మహదేవన్ మహాత్యమే. సాహిత్యానికే పెద్దపీట వేసి, సాహిత్యం అర్థం తెలుసుకుని, మాటలు వినబడేలా ట్యూన్లు కట్టి మెప్పించే వారే తప్ప ట్యూన్ యిచ్చి పాట రాయమని ఆయన ఏ పాటల రచయితనీ కోరలేదు. ట్యూన్ కుదరడం లేదని పాటలోని పదాలు మార్చమని అడిగిన సందర్భమూ ఆయన కెరీర్‌లో ఎప్పుడూ ఏర్పడలేదు. మహదేవన్‌కి ఇంత పేరు రావడంలో తెలుగు బాగా తెలిసిన మలయాళీ పుహళేంది సహకారం ఎక్కువే. అందుకే పుహళేందిని తనతో సమానంగా గౌరవించేవారు. అది గమనించి ఇతరులూ మహదేవన్‌తో పాటు పుహళేందికీ అంతే మర్యాద గౌరవం ఇచ్చేవారు.
''సినిమా పాట ఎలా వుండాలి, ఏది అవసరమో గ్రహించి, ఏ గాయనీ గాయకులైతే ఆ పాటలకు న్యాయం చేయగలరో గుర్తించి, ఆ పాటను గాయనీ గాయకులు అనుభవించి పాడేలా చేసేవారు. అంతేకాదు ఆయన పాటలు సామాన్యుడు సైతం పాడుకుని పులకించి పోయే తీరులో వుండేది'' అనేవారు గాయకుడు బాల సుబ్రహ్మణ్యం.
సంగీత దర్శకుల్లో సి. రామచంద్రని బాగా ఇష్టపడిన మహదేవన్ ''ఏ రాగంపైనా ప్రత్యేకమైన అభిమానం లేదు. పాటని బట్టి అది ఏ రాగంలో ట్యూన్ చేస్తే బాగుంటుందో ఆ రాగానికి ప్రాధ్యాన్యత ఇస్తూంటాను. చిత్రంలోని సన్నివేశాలను బట్టి ఏయే ఎఫెక్ట్‌లు కావాలో దర్శకుడు చెప్పాక వాటిననుసరించి ఆయా ఎఫెక్ట్‌లు రావడానికి కృషి చేస్తాము. దర్శకుడు సహకారం ఎంత ఎక్కువగా ఉంటే మా కృషి ఆ ప్రకారం వుంటుంది. ప్రేక్షకులు, శ్రోతలు ఎలాటి పాటలను ఎక్కువ ఆదరిస్తే ఆ తరహాలోనే పాటలు కూరుస్తుంటారు సంగీత దర్శకులు సాధారణంగా'' అని చెప్పేవారు.
బాబూమూవీస్, జగపతి, యువచిత్ర, భార్గవ్ ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ వంటి పలు నిర్మాణ సంస్థలు, ఆదుర్తి, బాపు, కె. విశ్వనాథ్ వంటి దర్శకులు మహదేవన్‌కే సంగీత దర్శకత్వం బాధ్యతలు అప్పగించడంలో ప్రాధాన్యత యిచ్చేవారు. యువచిత్ర అధినేత కె. మురారి అయితే మహదేవన్ తన చిత్ర సంగీత దర్శకుడని, మార్చే ప్రస్తే లేదని తెగేసి చెప్పడమే కాకుండా మహదేవన్ సంగీతం చేయకుండా చిత్రమే నిర్మించనని అంటూ ఆ మాట నిలబెట్టుకున్నారు.
మంచి మనసులు, మూగ మనసులు, తేనె మనసులు, కన్నె మనసులు, విచిత్ర బంధం, దాగుడుమూతలు, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, దసరాబుల్లోడు, అదృష్టవంతులు, ఏకవీర, సాక్షి, సంపూర్ణ రామాయణం, అందాల రాముడు, బుద్ధిమంతుడు, బాలరాజు కథ, ముత్యాలముగ్గు, గోరంత దీపం, ఉండమ్మా బొట్టుపెడతా, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, శంకరాభరణం, శుభలేఖ, శ్రుతిలయలు, సిరివెన్నెల, వీరాభిమన్యు, సుమంగళి, మాతృదేవత, మనుషులు మారాలి, లక్ష్మీ నివాసం, సోగ్గాడు, సెక్రెటరీ, ప్రేమ్‌నగర్, ప్రేమమందిరం, అడవిరాముడు, గోరింటాకు, త్రిశూలం, నారీ నారీ నడుమ మురారి, మంగమ్మగారి మనవడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య, శ్రీనివాస కల్యాణం ఇలా అనేక చిత్రాలు హిట్ కావడంలో మహదేవన్ కూర్చిన సంగీతం ఎక్కువ దోహదపడింది. 'మామ' మహదేవన్ జయంతి మార్చి 14.