ప్రకృతి మరోసారి రైతన్నపై కన్నెరజ్రేసింది. వర్షం రూపంలో విరుచుకుపడింది. చెరువులను, కాలువలను పంట చేలపైకి ఉసిగొల్పింది. సాయం చేస్తున్నట్టే నటించి దొంగదెబ్బ తీసింది. చేతికందిన పంటను నోటికి అందకుండా చేసింది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంటను కళ్ల ముందే కాటేసింది. మరో పక్షం రోజుల్లో కోతలు ప్రారంభించాలనుకున్న వేలాది మంది రైతుల ఆశ ల్ని నీట ముంచింది. ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియక అన్నదాత కంటికిమంటికీ ఏకధారగా రోదిస్తున్నాడు.