పింఛన్ల మంజూరు, ఇందిరమ్మ ఇళ్లు, అభయ హస్తం తదితర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం పల్లెబాట, నగర బాట తరువాత ప్రజాపథం నిర్వహించినప్పటికీ ఆశించి నంత ఫలితం లభించలేదు. ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ రచ్చబండ కార్యక్రమైనా ఎంత వరకూ సఫలమవుతుందన్నది పాలకుల చిత్తశుద్ధిని బట్టే ఉంటుంది.
పెన్షన్‌కు అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు ల్లో వయస్సు తప్పుగా ఉండటంతో పింఛన్ పొందలేకపోతున్నారు. ఆస్పత్రుల్లో తక్షణం వైద్యం అందటంలేదన్న విమర్శలున్నాయి. ఆరోగ్య శ్రీలో జబ్బును కనుగొనేందుకు పరీక్షలకు రూ.వేలల్లో ఖర్చవుతోందని పలువురు బాధితులు అంటున్నారు. ఇక రేషన్ కార్డుల విషయానికి వస్తే గతంలో కార్డుకోసం రుసుం చెల్లించి ఐపీఆర్ ఫాం పొందినవారున్నా.... రేషన్ దక్కటంలేదు.
రచ్చబండ కార్యక్రమం పరిష్కారం చూపుతుందో కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది.