26, జనవరి 2011, బుధవారం

జాతీయ చిహ్నం కథాకమామిషు

జాతీయ పతాకం మీద కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయా నికి, ధర్మానికి ప్రతీకలైతే, కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్... ఇది దాదాపు అందరికీ తెలిసి ప్రముఖ సినీనటుడు సాయికుమార్ డైలాగ్.

జాతీయ చిహ్నం కథాకమామిషు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం. మన జాతీయ చిహ్నాన్ని 1950 జన వరి 26న గుర్తించారు. రాష్ట్ర చిహాన్ని అశోకుడి సారనాధ్ స్థూపం నుండి గ్రహించబడింది.

మాతృకలు నాలు గు సింహాలు, వాటి వెనుక వైపుల ఎదురెదురుగా ఉండి ఒక స్థంభాగ్రా న నిలిచి ఉంది. వాటికి, ఉపరితలా నికి మధ్య ఉబ్బెత్తున శిల్పాలుగా ఒ క ఏనుగు, ఒక కదం తొక్కుతున్న గుర్రం, ఒక ఎద్దు, మరియు ఒక సిం హం, వాటి మధ్యలో చక్రాలు ఒక ఘంటాకారపు పద్మంపై నిలిచి ఉం టాయి. జాతీయ చిహ్నంలో 1950 జనవరి 26న భారత ప్రభుత్వం స్వీ కరించిన ప్రకారం 3 సింహాలు మా త్రమే కనబడుతాయి. నాల్గో సిం హం దృష్టికి అందకుండా ఉంటుం ది. చక్ర స్తంభ అగ్రభాగాన మధ్యలో కుడివైపు ఒక ఎద్దు, ఎడమవైపు ఒక గుర్రంతో ఉబ్బెత్తు శిల్పంగా చెక్కబ డినవి ఉంటాయి. మిగిలిన చక్రాలు కుడి, ఎడమలవైపు చివరలలో రేఖా మాత్రంగా ఉంటాయి.

ఘంటాకార పు పద్మం మాత్రం వదిలి వేయబ డింది. సత్యమేవ జయతే అనే ఉపని షత్తు నుంచి తీసుకున్న పదాలు. వీ టి తెలుగు అర్థం నిజమే గెలుస్తుంది. స్థంభం అగ్ర భాగంలో కిందివైపు దే వనాగరి లిపిలో రాయబడి ఉన్నా యి. గత 61 సంవత్సరాలుగా ఈ జాతీయ చిహ్నాన్ని కరెన్నీ నాణేలపై, నోట్లపై, దస్తా వేజులపై, కేంద్ర ప్రభు త్వ కార్యాలయాలపై నిత్యం చూస్తూ నే ఉన్నా వీటి విశేషాలు మాత్రం తె లిసింది చాలా తక్కువ మందికే. అన్నట్లు ఈ చిహ్నం విశేషాలను పా ఠ్యాంశాలలో చేరిస్తే ఇంకా బాగుం టుందేమో. భావితరాలకు దీని గు రించి తెలుసుకునే అవకాశం లభి స్తుంది