తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పోరాటానికి సీపీఐ ప్రత్యేక కార్యచరణతో సిద్ధమవుతోం దని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు, శాసనసభా పక్షనేత గుండా మల్లేశ్ చెప్పారు.
వచ్చే పార్లమెం ట్ బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 20వ తేదీన తె లంగాణ వ్యాప్తంగా అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు, 24న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ల ఎదు ట సామూహిక ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.