16, ఫిబ్రవరి 2011, బుధవారం

నాకొద్దీ....అధికారం: రఘువీరా

రెవెన్యూశాఖలో అత్యంత కీలకమైన అధికారం అది. ఎంతటి లిటిగేషన్ భూమిపైనైనా నిర్ణయం తీసుకునే అధికారం రెవెన్యూ మంత్రికి ఉంటుంది. భూములపై ఫిర్యాదులు వచ్చినప్పుడు....అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం మంత్రికి బిజినెస్ రూల్ 22 కింద ప్రభుత్వం కట్టబెట్టింది. దీన్ని అడ్డంపెట్టుకొని అయినవారికి ఆకుల్లో...కాని వారికి....అన్న చందంగా తీర్పులు చెప్పవచ్చు. అయితే ఇంతటి అధికారం తనకొద్దని రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ముందుకొచ్చారు. రెవెన్యూకోర్టు నిర్వహించే అధికారాన్ని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శికి అప్పగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

భూ వివాదాలు తన దృష్టికి వచ్చినప్పుడు ఏవరో ఒకరికి ఆయాచితంగా మేలు చేశారన్న అపకీర్తిని, ఒకరికి మంచిచేసి మరొకరికి చేడుచేశామన్న అపవాదు తనకు అంటకూడదనే ఈ అధికారానికి మంత్రి దూరంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.