: రోడ్డు ప్రమాదాలను నివారించే క్రమంలో డ్రైవింగ్‌లో పూర్తి స్థాయి ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించేందుకు ఆర్టీసీ ఆధ్వర్యంలోనే డ్రైవింగ్ స్కూళ్ళ నిర్వహణ బాగుంటుందని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మౌలిక వసతులను విస్తృతపరుచుకోవడంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డిపోల్లో, లేదా ఆర్టీసీ స్థలాల్లో డ్రైవింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు నిర్ణయించారు. సరుకు రవాణాకు తగిన ఏర్పాట్లు చేసుకునే దిశగా ఆర్టీసీ సన్నాహాలను చేస్తూనే.. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ సేవలను సరుకు రవాణాలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.