13, మార్చి 2011, ఆదివారం
మల్టీ స్టారర్ చిత్రాలకు ప్రాణం పోస్తున్న వెంకి, పవన్?
మన సినీ గత చరిత్రలో మల్టీ స్టారర్ చిత్రాలు బోలెడు దర్సనమిస్తాయి. 80 వ దశకంలో ఐతే.. మల్టీ స్టారర్ చిత్రాలు రాజ్యమేలేయి అనడంలో సందేహం లేదు. ఎన్టిఆర్ నాగేశ్వర రావు, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు వీరంతా స్టార్ లుగా వెలుగొందు తూనే కలసి పని చేయడానికి ముందుకు వచ్చేవారు. దర్శక నిర్మాతలు కూడా ఆతరహ చిత్రాలు నిర్మించేందుకు తాపత్రయ పడేవారు. అందుకు తగ్గ కధలు సిద్దం చేయమని వత్తిడీ తెచ్చేవారు. కానీ కాలం మారింది.. ఇప్పటి హీరోలు సినిమా అంతా తామే అని వ్యవహరిస్తుండటం.. అందుకు తగ్గట్లు అభిమానులూ వికృత చేష్టలు చేస్తుండటంతో చేయాలని ఉన్నా.. మల్టీ స్టారర్ చిత్రాలకు మనహిరోలు భయపడి దూరమై పోయారు. 1990 తరువాత మల్టీ స్టారర్ చిత్రాలు కరువవ్వడం తో..ఈ పరిస్తితి నుంచి బైట పడే సాహసానికి రెడీ అవుతున్నారు వెంకటేష్, పవన్ కళ్యాణ్ లు. వీరి కాంబినేషన్లో శ్రీకాంత్ అద్దాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు గతంలో వచ్చిన వార్తలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చనుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి