20, ఏప్రిల్ 2011, బుధవారం
అవినీతి గుర్తు తెచ్చుకోనేలా వై.ఎస్.ఆర్ పార్టీ జెండా
వై.ఎస్ ముఖ్యమంత్రి హయాంలో ప్రజా సంక్షేమం పేరిట బంధువులకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి తోడ్పాటునిచ్చారని... చివరకి సామాన్యుడినితెలుగుదేశం నేతలు పట్టించుకోలేదు సరి కదా.. వాళ్ళని భయపెట్టి పులివెందులలో వార్డు మెంబరు నుంచి ఎంపి వరకు వై.ఎస్ కుటుంబ సభ్యులే పదవులు కొట్టేసి .. అంతా ప్రజాభిమనమని చాటుకోన్నారని ఆరో పించారు రేవంత్‌రెడ్డి, యర్రబల్లె దయాకరరావు, పయ్యావుల కేశవ్‌లు. పులివెందుల ప్రచారానికి వచ్చిన వారు విలేఖర్లతో మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో ఇంత వరకు ఎన్నడూ ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరగలేదన్నారు. వైఎస్ ధౌర్జన్యాలకు, రిగ్గింగ్‌లకు పాల్పడి విజయం పొందుతూ వచ్చారన్నారు. ఈసారి ఉప ఎన్నికల్లో ప్రీ పోలింగ్ జరిగే ఓటర్లు వై.ఎస్ కుటుంబంపై కక్ష తీర్చుకొని వై.ఎస్.జగన్, విజయమ్మ, వివేకాలను ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వై.ఎస్.అభివృద్ధి పథకాల పేరిట అవినీతి సొమ్మును సంపాదించారని, ఆ అవినీతి సొమ్మును గుర్తు తెచ్చుకొనేందుకు వై.ఎస్.ఆర్ పార్టీ జెండాలో ఆ పతకాలనే రూపొందించారని, ఆ జెండా అవినీతి జెండాగా అభివర్ణించారు.