20, ఏప్రిల్ 2011, బుధవారం
డీఎల్‌కు ఇదే చివరి ఎన్నికలు : శోభ
100 మంది డమ్మీ జగన్‌లు, 60 మంది డమ్మీ విజయమ్మలను పోటీలో ఉంచినా వారి భారీ విజయాన్ని ఆపలేరన్నారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి. జగన్ పార్టీ తరపున మైదుకూరు నియోజకవర్గంలోని పలుప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్న ఆమె కాసేపు మీడియాతో మాట్లాడుతూ... యువనేత జగన్‌ను ఓడించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు పన్నుతోందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అధికార దర్పంతో భయాందోళనలకు గురిచేస్తోంద ని ఆరోపించారు. పోలీసులతో దౌర్జన్యం చేసి ఈ ఎన్నికల్లో మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి గెలవాలనుకుంటున్నారని, ఆయన చేసిన దౌర్జన్యాలకు ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని.. డీఎల్‌కు ఇదే చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు.