20, ఏప్రిల్ 2011, బుధవారం

ఆ అవలక్షణాలు చేసేది జగనే...

అవలక్షణాలు చేసేది జగనే, నిందలు మాత్రం వేరొకరి పైనా వేయటం ఆయనకీ సాటి ఎవరూ లేరని ఎద్దేవా చేసారు 20 సూత్రాల కమిటీ చైర్మన్‌ తులసిరెడ్డి. జగన్, విజయమ్మల పేర్లతో కాంగ్రెస్స్ నీచ రాజకీయాలకి పాలపడుతోందని చెప్తున్న జగన్.. ఇన్నాళ్ళు తన వెంటతిరిగిన సురేష్‌బాబు తో బిఎస్పీ పార్టీ తరపున నామినేషన్‌ వేయలేదా, ఆయన పార్టీ ఎప్పుడు మారారో చెప్పాలని, అలాగే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి మీ పార్టీ వారు కాదా సమాజ్‌వాది పార్టీ తరపున నామినేషన్‌ వేయలేదా అని ఆయన ప్రశ్నించారు.
వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అద్యక్షుడు కడప పార్లమెంటు అభ్యర్థి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి సీఎం పదవి ఇవ్వకపోవడంతో ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. చిన్నాన్న వివేకాకు మంత్రి పదవి ఇస్తే ఆత్మగౌరవం లేదట. నీవు పదేపదే ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నావు ఏ రాజనీతి శాస్త్రంలో ఉందో మేము చదువుకొని నేర్చుకొంటామన్నారు. తండ్రి శవం పక్కన పెట్టుకొని సీఎం పదవి కోసం ప్రాకులాడలేదా అని ఆరోపించారు. ఎన్నికలయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు వస్తాయన్నది వాస్తవమన్నారు. వై.ఎస్‌.ఆర్‌ పార్టీ అంతమవుతుందని ఆయన జోస్యం చెప్పారు.