సత్యసాయి ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని సత్యసాయి ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ సఫాయా తెలిపారు. బాబా ఆరోగ్యంపై గురువారం ఉదయం ఆయన తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ బాబా శరీరంలో అన్ని అవయవాలు పనితీరు పూర్తి గా బలహీనపడిందని, ప్రస్తుతం ఆయన శరీరం వైద్యానికి ఏ మాత్రం సహకరించటంలేదని కాలేయం పనితీరు పూర్తిగా దెబ్బతింది, రక్తపోటు దారుణంగా పడిపోయిందని తెలిపారు. ఇంకా వెంటిలేటర్ ద్వారా శ్వాస అందజేస్తున్నామని , హిమోడయాలసిస్ కొనసాగుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.దీంతో బాబాకు వైద్యం చేస్తున్న వైద్యుల తో పాటు భక్తులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నాఋ