2, మే 2011, సోమవారం

లాడెన్ ని చంపేసాం : ఒబామా ప్రకటన

 అమెరికా  ట్విన్‌టవర్స్ పేల్చివేతతో తన సత్తా చూపి పదేళ్లుగా దొరకకుండా ముప్పుతిప్పలు పెట్టి, తప్పించుకు తిరుగుతున్న లాడెన్ ఎట్టకేలకు అమెరికా సైన్యం చేతిలో హతమయినట్లు తెలుస్తోంది.  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ ప్రకటన విడుదల చేస్తూ వాషింగ్టన్ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11.30 గం.లకు లాడెన్ మరణించినట్లు  ధృవీకరించారు.   అమెరికా గూఢాచారి సంస్థలు చేసిన దాడులలో  లాడెన్‌  హత మైనట్టు  ఒబామా తన ప్రకటనలో వెల్లడించారు.లాడెన్ మృతి నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ విదేశాల్లోని తమ పౌరులను హెచ్చరిస్తూ.... విదేశాల్లోని తమ రాయబార కార్యాలయాలను అప్రమత్తం చేసింది. లాడెన్‌ను మట్టుబెట్టారనే ఆగ్రహంతో ఆల్ ఖైదా అమెరికా పౌరులపై దాడులు చేసే ప్రమాదం ఉందని తెలిపింది.