నిన్న ప్రత్యర్ధుల కాల్పులలో గాయపడి కేర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు సోమవారం బులెటిన్ విడుదల చేశారు. అక్బరుద్దీన్‌కు రక్తపోటు, నాడి క్రమంగా మెరుగుపడుతోందని.. వెంటిలేటర్ ద్వారా శ్వాస, మూత్రపిండాలకు డయాలసిస్ కొనసాగుతోందని తెలిపారు. కాగా... అక్బరుద్దీన్ పై దాడి చేసిన నిoదితులని పట్టుకొనేందుకు ప్రత్యెక పొలిసు బృందాలని ఎర్పాటు చేసి గాలిపు చర్యలు చేపట్ట్టినట్టు నగర పోలీసు కమీషనర్ ఎ.కే. ఖాన్ చెప్పారు.