ఆరుగాలం శ్రమించి పండిస్తే ధర ఉండదు. అయినా ప్రత్యామ్నాయం లేక రైతు వ్యవసాయాన్నే నమ్ముకుంటాడు. కష్టనష్టాలు ఎదురవుతున్నా మరో పని చేయలేక.. చేతకాక అన్నదాత భూమాతనే నమ్ముకుంటాడు. ఏటేటా.. ప్రతీ సీజనులోనూ ఎదురుదెబ్బ లు తగులుతూనే ఉన్నా.. నష్టాల గాయాలను మాన్పుకుని మళ్లీ కష్టాలసాగుకు సమాయత్తమవుతాడు రైతన్న. అయితే ఈ ఖరీఫ్ సీజనులో మేఘాలు ముఖం చాటేశాయి. వర్షం వస్తుందన్న ఆశతో సాగుకు సమాయత్తమైన అన్నదాత విత్తనాలను చల్లాడు. మండుతున్న ఎండలకు ఆ విత్తనాలు మొలకెత్తకుండా ఎండిపోతున్నాయి. దీంతో మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి నాట్లు వేయాల్సి వస్తోంది. ధాన్యం ధర బాగా లేదని నేతల్ని నిందించినా.. క్రాప్ హాలిడే అంటూ ఆగ్రహించినా..
మట్టితో విడదీయలేని బంధం రైతన్నది. గడచిన సీజనులో కష్టనష్టాలను ఇంకా మరువకముందే ఖరీఫ్‌కి సన్నద్ధమైన రైతన్నకు అప్పుడే కష్టాలు ఆరంభమయ్యాయి. జూన్ తొలి వారంలో రావాల్సిన రుతుపవనాలు రెండోవారంలోనూ దోబూచులాడాయి. రుతుపవనాల ప్రభావం లేకపోయినా రెండు, మూడు వారాల్లో జిల్లాలో అక్కడక్కడా అడపాదడపా వర్షాలు కురిశాయి. జూన్ రెండో వారం లో వచ్చే వర్షాలతో వ్యవసాయం ఆరంభిస్తారు. రెండు, మూడు వారాల నాటికి వ్యవసాయ పనులు బిజీగా ఉంటాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయ సందడి కానరావడంలేదు.