26, జూన్ 2011, ఆదివారం

కట్నంతో వరుడు పరారీ



గుంటూరు: మరికొద్ది సేపట్లో ముహూర్తం. తెల్లారితే పెళ్ళితంతు మొదలు. తీరా చూస్తే ఏముంది? పెళ్ళికొడుకు లేచిపోయాడు. కట్నం డబ్బు తీసుకుని ఉడాయించాడు. గుంటూరు ఆనందనగర్‌లో ఆదివారం ఉదయం పది గంటలకు వివాహం జరగాల్సి వుండగా వరుడు ఇర్ఫాన్ రూ.లక్ష కట్నం డబ్బుతో సహా పరారయ్యాడు. పెళ్ళికుమార్తె తనకు నచ్చలేదంటూ వంకలుపెట్టి వెళ్లిపోయాడు. దీనితో మనస్తాపం చెందిన పెళ్ళికుమార్తె ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే సకాలంలో స్పందించిన స్థానికులు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుడు కనిపించడం లేదంటూ వరుడి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు