భారవి 'ఆదిశంకర'లో నాగార్జున అక్కినేని నాగార్జున అదృష్టమేమో... కొన్ని అద్భుతమైన పాత్రలు ఆయననే వరిస్తున్నాయి. గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రలను పోషించి, తాజాగా షిరిడీ సాయిబాబా పాత్రను కూడా ధరించనున్న నాగార్జునకు, ప్రముఖ రచయిత జె.కె.భారవి మరో అద్భుతమైన పాత్రను ఆఫర్ చేశారు. ఆయన డైరెక్ట్ చేస్తున్న 'ఆది శంకర' సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించడానికి నాగార్జున అంగీకరించారు. ఆది శంకరుని జీవితాన్ని మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషించిన ఓ మాస్ పాత్రను నాగార్జున పోషిస్తున్నారు. ఈ సినిమా కథ విని, ఇంతవరకు తీసిన రషెస్ చూసి ఇన్స్ పైర్ అయిన నాగార్జున ఈ పాత్ర చేయడానికి యాక్సప్ట్ చేశారు. ఈ సినిమా మూడో షెడ్యులు త్వరలో మొదలవుతుంది. |