భూమిని నమ్మి నష్టపోయినవారుండరని సినీనటుడు, బిల్డర్ మురళీమోహన్ చెప్పారు తాను ఇతర వ్యాపారాల్లో నష్టపోయినట్లు చెప్పారు. సినీనటుడు శోభన్ బాబు సూచన మేరకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి లాభాలు గణించినట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ది చెందుతున్న నగరాల్లో గుంటూరు ముందువరుసలో ఉందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే వందల రెట్లు లాభాలు వస్తాయని చెప్పారు.