మనిషి జీవితాన్ని ఉత్సాహ భరితంగా మార్చేసే శక్తి కాఫీకి ఉందన్నది నిజం..
ఒక ప్పుడు పై రాష్ట్రాల నుండి కాఫీని దిగుమతి చేసుకునే మనం...
నేడు మన రాష్ట్రంలో అందునా ప్రకృతి అందాలకు నెలవైన అరకు వ్యాలీలో...
వాణిజ్య పంటలలో ఒకటిగా పండిస్తు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకోవటం
ఆనందించ దగ్గ పరిణామమే... అయినా అందుకు తగ్గట్టు కాఫీ కార్మికుల కష్టాలు
పాలచాటు... డికాషన్‌లా చేదుగా ఉండటం ఆందోళన కలిగించేదే...
ఉదయాన్నే కాఫీ అంటూ నిద్రలేచేవారు మనలో చాలా మంది ఉన్నారు. కాఫీ మనిషి జీవిత కాలాన్ని పెంచుతుందని..అనేకరోగాలను నివారిస్తుందని వాదిం చే వారు కొందరున్నారు. వైద్యానిక పరం గానూ కాఫీ మంచి చేసుందన్న రుజువులు అసలు కాఫీ లేకుండా రోజువారీ జీవి తాన్ని ప్రారంభించడానికి ఇష్టపడనివారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతోంది కూడా .
ప్రపంచ వ్యాప్తంగా కాఫీ అధికంగా పడిస్తున్న దేశాల లో బ్రెజిల్ అధికఉత్పత్తి చేస్తుండగా... వినియో గంలో
అమెరికాదే అగ్రస్ధానంలో నిలుస్తోంది. తరువాతి స్ధానంలో జపాన్, యూరోపియన్ ఇలా వర్ధమనా దేశాలదే... మన దేశంలో కాఫీ వినియోగం తక్కువగా ఉన్నా సాంప్రదాయ పద్దతులలో కాఫీని పండించడంలో కేరళ తమిళనాడు, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సాలలో కాఫీ ఎక్కువగా పండుతోంది.
మన కాఫీ ప్రత్యేకం...
ప్రకృతి సోయగాలకు, పరవళ్లు తొక్కే జలపాతాలకు, పచ్చనితివాచీలను మై మరపించే పూలవనాలకు వెరసి ఆహ్లా దకర వాతావరణానికి అద్భుత నిల యంగా నిలుస్తున్నవిశాఖ జిల్లా అరకు వ్యాలీ కాఫీ పంటలకు అగ్రగామిగా నిలుస్తూ.. ప్రత్యేకతని నిరూపించుకుంటోంది.నేడు విశాఖ మన్నెం లో పెరుగుతున్న కాఫీ అద్భుత రుచులతో అంతర్జాతీ య పేరు ప్రఖ్యాతలు కూడా పొంది ఇక్కడి గిరిజనులకు మంచి ఉపాధిగా మారి పోయింది...విశాఖ ఏజన్సీలోని అనంతగిరి, పెదబయలు, గూడెం కొత్త వీధి, చింత పల్లి, నర్సీపట్నం, పాడేరు ఇలా దాదాపు 11 మండలా లలో ఎందరో గిరిజనులజీవితాలలో కాఫీ సాగు వెలు గులు నింపుతోంది.
దేశ వ్యాప్తంగా ఐదు ప్రాంతీయ కాఫీ పరిశో ధనా కేంద్రాలుండగా..1976లో అప్పటి ముఖ్య మంత్రి జలగం వెంగళరావు కేంద్రాన్ని ఒప్పించి గూడెం కొత్తగూడెం మండలంలో ఆరవ దానిని ప్రారంభించిన నాటి నుండి విశాఖ కాఫీకి పేరు ప్రఖ్యాతులకు మరింత ఆసరా లభించినట్లు అయ్యింది. ఇప్పటికే రాష్ట్ర అటవీ అభివృధ్ధి సంస్ధ (ఎపిఎఫ్‌డిసి) సారధ్యంలో కాఫీ సాగు అరకుతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతాలలో విస్తారమైంది. ఎప్పటికప్పుడు లక్ష్యాలు విధించుకుంటూ పంట విస్తీరిస్తున్న క్రమంలోనే కేంద్ర కాఫీ పరిశోధన సంస్ధ శాస్త్రవేత్తలు, పాడేరు గిరిజనా భివృద్ధి సంస్ధ (ఐటిడిఏ) కాఫీ విభాగం అధికా రులు కొత్త తరహా వడగాలను రూపొందిస్తు ఇక్కడి కాఫీకి ప్రత్యేకతలు వచ్చేలా చూస్తున్నారు.
కాఫీ ఉత్సవాలలో అదుర్స్
బెంగుళూరుకు చెందిన 'అదితి'అనే జాతీయ సంస్ధ ఇక్కడ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కాఫీ ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించగా అందులో స్టాల్‌ని ఏర్పాటు చేసిన ఈ ప్రాంత గిరిజనులు తమ కాఫీ రుచులతో దేశ విదేశాలనుంచి వచ్చిన ప్రతినిధులను 'ఔరా' అద్భుతం అని ప్రశంసలొలికేలా చేసారు. అంతే కాకుండా తాము పండిస్తున్న కాఫీతో చాక్లెట్లను తయారు చేసి ప్రత్యేక ప్రశంసలందుకున్నారు.
ఉపాధి హామీ
మరోవైపు కాఫీ సాగులో సీజన్లో ప్రతి గిరిజనుడు కనీసం 15 వేలు అయినా లబ్ధి పొందేలా చర్యలు చేపడుతునే ఇందులో భాగంగా ఉపాధి హామీ పధకాన్ని కూడా కాఫీ తోటల పెంపకంలో వర్తింప చేసి గిరిజనులకు అండ గా నిలచేలా చర్యలు చేపట్టారు. కాఫీ తోటల పెంపకంలో కీలకంగా కాఫీ తీగలకు అండ గా నిలచే సిల్వర్ ఓక్ మొక్కల పెంపకాలను పెంచడమే కాకుండా... అడవీ ప్రాంతంలో వాటిని కొట్టేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ప్రోత్సాహకాలు...
కాఫీ పంట గిరిజనులకు ఆర్ధికంగా పరిపుష్టి చేసేదిగా ఉండటంతో ప్రభుత్వం వారికి కాఫీ విత్తనాలు, కాఫీ శుధ్ధీకరణ యంత్రాలు, డ్రైయింగ్ యార్డుల నిర్మాణానికి నిధులు అందచేస్తునే పలు గ్రామాలలో సేంద్రీయ పద్దతులలో కాఫీపంటను పండించేందుకు ప్రత్యే క శిక్షణకూడా ఇస్తున్నారు.
అలాగేసిల్వర్ఓక్ మొక్క లపై వహించాల్సిన శ్రద్ద, విధి విధానాలు తదితరాలపై సలహాలు అందిస్తూ ప్రోత్సాహకంగా నిలుస్తున్నారు.
మావోల వల్ల నష్టాలు...
మావోల చర్యల వల్ల తమకు ఏటా కోటి రూపాయల పైచిలుకు నష్టం వస్తోందని... ఎపిఎఫ్‌డిసి ప్రతినిధులు పేర్కొన్నారు. మావోల హెచ్చరికల్ని బేఖాతలరు చేస్తూ... కాఫీ తోటలలో పనిచేయిస్తునందుకు రేంజర్ మాధవరావుని మావోలు హత్య చేయటం, ఎఫ్డిసి అధికారులపై దాడులు జరపడం, కాఫీ పల్చర్స్, యార్డులను పేల్చి వేయటం వంచి చర్యలకు దిగారని దీంతో గిరిజనులు సైతం భయ్రభాంతులకు లోనయ్యా రని దీంతో గత ఏడాది నిర్ధిష్ట లక్ష్యాన్ని కూడా కాఫీ దిగుబడిలో చేరుకోలేక పోయామని చెప్పారు. మన్నెం అంతా కాఫీ సాగు విస్తారంగా ఉన్నా పళ్ల సేకరణ ఎప్ప టి కప్పుడు నిలచి పోతూ ఉండటంతో పాటు గిరిజను లకు ఎన్ని శిక్షణా తరగతులు నిర్వహించినా తగిన సంరక్షణా చర్యలు చేపట్టక పోవటం వల్ల కూడా దిగు బడి తగ్గుతోందని దీని వల్ల గిరిజన ఉపాధి పోవటమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండీ పడుతోందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
పడరాని పాట్లు...
లక్షలాది ఎకరాలలో కాఫీ పంట విస్త్తరిస్తుంటే... సమస్యలు నీడలా వెంటాడుతూ... కాఫీ కార్మికులని వేధిస్తున్నాయి. ఇప్పటికే మావోల సమస్యలతో సతమ తమవుతున్న కార్మికులకు వాతావరణ పరిస్ధితులు కూడా అడపా దడపా ఇబ్బందులు పెడుతూ... దిగు బడి ఆసాంతం ఒక్కసారిగా పడిపోయేలా చేస్తున్నా యని వాపోతున్నారు.
మరోవైపు కాఫీ తోటలన్నీ గిరిజనుల సొంతం చేయాలంటూ...మావోల హెచ్చరికల కారణంగా కాఫీ పండ్ల్ల సేకరణకు ఆటంకం ఏర్పడి చాలా మేర పంట నేల పాలయ్యి నష్టాలు మిగిల్చిందని ఇక్కడి గిరిజనులు వాపోయారు. తాము సరైన సమయంలో పండ్ల కోతకు వెళ్లని కారణంగా వాటిని ఇతరులు కోసి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
కార్మికుల వెతలు...
ఏళ్ల తరబడి కాఫీ తోటల్లో పనిచేస్తున్నా... రాష్ట్ర అటవీ అభివృధ్ధి సంస్ధ తమ కష్టాలు పట్టించుకోవట్లేదని, కోట్ల కొలది లాభాలు గడిస్తున్నా... చిన్న చిన్న సమస్య లు కూడా తర్చేందుకు కూడా వెనుకాడుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. కనీస వేతనం, ఉద్యోగ భృతి లేక పోవటం తో పాటు విధి నిర్వహణలో ప్రమాదాలకు గురయ్యే కార్మికులు గురించి కూడా ఆరెదోళన కలిగించే అంశర్గగా పేర్కొన్నారు.
అంతర్జాతీయ రుచులు...
అరకు మన్నెంలో పండుతున్న కాఫీ రుచు లకు అంతర్జాతీయగా ఎనలేని పేరు ప్రఖ్యా తులున్నాయి. అరబిక్ కాఫీ రుచులకు తగ్గ ట్టుగా కాఫీ తయారీలో నాణ్యత పెంచేం దుకు ఎపిఎఫ్‌డిసి అత్యాధునిక యంత్రాల ను రప్పించి ఆమేరకు రుచికర మైన కాఫీని తయారు చేస్తోంది.
అవార్డులు..
ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కించుకున్న అరకు కాఫీ గింజలని ఎలాంటి రసాయనాలు, పురు గుల మందులు వేయకుండా కేవలం సేంద్రీయ ఎరువులతోనే పండించిన పంటగా ప్రశంసలందుకోం టోంది. ఉత్తమ కాఫీగా 2009లో కాఫీ బ్రిలియన్స్ పురస్కారం అందుకుని అందరి మన్ననలు పొందింది. ఇక చింత పల్లికి చెందిన నర్సి రాములమ్మ అనే గిరి జన మహిళ ఏటా సెంట్రల్ కాఫీ బోర్డు అందించే అత్యంత ప్రతిష్టాకర కాఫీ ఫైన్ కప్ అవార్డుని అందుకుంది.2009లో హైదరాబాద్ నంది ఫౌండేషన్ నిర్వహించిన ఆర్గానిక్ కాఫీ మహోత్స వంలో అరకు కాఫీ సత్తా చూపి తన గుభా ళింపులతో ఆకట్టు కుంది.