ప్రస్తుతం మార్కెట్‌లోకి అడుగుపెడితే... దాదాపు ప్రతిషాపులోనూ...
ప్రయాణించేందుకు ఏ టాక్సీనో పిలిపించుకుని కారెక్కితేనో... చాలా ఇళ్ల షోకేసుల్లో... టీపాయ్‌పైనా.. ఆఫీసుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ ఓ లావుపాటి వ్యక్తి గుండ్రని తలతో...
పెద్ద బానపొట్టతో... నిత్యసంతోషంతో నవ్వులు చిందిస్తూ... చూడగానే మనకి కూడా
నవ్వు తెప్పించేలా ఉండే ఆకారంతో ఓ బొమ్మ కనిపిస్తోంది. ఇదే లాఫింగ్ బుద్ధ.
భారతావనిలో గత రెం డు దశాబ్ధాలుగా లాఫిం గ్ బుద్ద ఎంతో ప్రాచూర్యం పొందాడన్నది వాస్త్తవం. నేడు ఎక్కడ చూసినా... కనిపిస్తున్న ఈ బొమ్మకి పూజాదులు చేయక పోయినా... సుఖశాంతుల్ని, సిరి సంపదల్ని కురిపి స్తుందని ఫెంగ్‌షూయ్ నిపుణులు చెప్తుండటంతో దాదాపు ప్రతి ఒక్కరికీ దీనిపై గురి బాగానే కుది రింది. ఇంతకీ ఏ ఇంతకీ లాఫింగ్ బుద్ద ఎవరు? అనే విషయాన్ని చూస్తే...
లాఫింగ్ బుధ్ధ ఎవరంటే...
ఫెంగ్‌ఘాయ్ వస్తువులలో అత్యంత ప్రాధాన్యత దక్కించు కున్న వాటిలో లాఫింగ్ బుద్ధ ఒకటి. హిందూ దేవుళ్లలో ధనరాశులనిచ్చేది ధనలక్ష్మిగా పేర్కొంటూ ఆ మహాలక్ష్మి చిత్రాన్ని మన ఇళ్లలో పెట్టుకుని ఎలా పూజిస్తామా... బౌద్ధ మతంలో తమకు విజయాలను, ఐశ్వర్యాలను అందించేదిగా భావించి ప్రత్యేకంగా లాఫింగ్ బుద్దని పూజిస్తారు.
భారతావనిలో పుట్టిన బౌద్ధ మతం మన దేశం కన్నా విదేశాలలోనే ఎక్కువ ప్రాచూర్యం సంపా దిం చుకుంది. చైనా, జపాన్, ధాయిలాండ్ ఇలా అనేక దేశాలలోలాఫింగ్ బుద్దుడిపై అనేక రకాల ఆసక్తికరమైన కధలు కూడా ప్రచారంలో ఉన్నా యి. సాక్షాత్తు ఆ బుద్దభగవానుడే యావత్ మాన వాళి పడుతున్న కష్టాలను కన్నీళ్లను చూసి అనేక మందిని ఓదార్చాడని... అంతటి సహనం, ఓర్పు, దయ అన్నీ కేవలం బుద్ధుడికి మాత్రమే సొంతమ ని... ఆ క్రమంలోనే ఆయనే లాఫింగ్ బుద్ధగా అవతరించాడని ఓ కధ ప్రచారంలో ఉంది.
పూ తాయ్ బుద్ద్ద్ధ
లాఫింగ్‌బుద్ధాకి మరో పేరుగా చైనీయులు పిలుచు కునే పేరు హూతీ. దాదాపు వేయ్యి ఏళ్ల క్రితం చైనానికి లియాంగ్ వంశస్తులు పాలిస్తున్న రోజు ల్లో బుద్ధుడు తమ దేశంలో నివశించాడని... అప్ప ట్లో ఆతన్నిహూతీ అని కూడా పిలచేవారని కొంద రు చెప్తారు. అయితే ఆ కాలంలోనే సన్యాసి జీవి తాన్ని గడుపుతూన్న బుద్ధుడు పెద్ద బాన పొట్ట తో...నిత్యం నవ్వుతూ... తన దగ్గరకు వచ్చిన వారికి కావాల్సిన వస్తువుల ను తన చేతిలో ఉండే గొనె సంచి నుండి తీసి ఇస్తూ.. పిల్లలని అమితం గా ఇష్టపడుతూ.. అందరితో పూ తాయ్‌గా పిలి పించుకునేవాడన్న కధనం మరొకటి ప్రచా రంలో ఉంది. అయితే బౌద్ధ బిక్షువైన లాఫింగ్ బుద్ద్ద అసలు పేరు హోట్టే అని.. కాలక్రమంలో ఈ పేరు పూ తాయ్‌గా మారిందని చెప్తారు. చైనాలో పుట్టిన ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో తిరుగుతూ...అందరి బౌద్దబిక్షువులవలే ఓ భుజాన జోలె, చేతిన బిక్షాపాత్రతో కనిపించేవాడని ఆపద ల్లో ఉన్నవారు ఎలాంటి వారైనా సాయమందించే తత్వం ఆది నుండి ఏర్పరుచుకున్న హోట్టే పిల్ల లంటే అమితంగా ఇష్టపడుతూ... వారి తో ఆనందంగా ఉండే వాడని... పిల్లల కోసమే కాకుండా పెద్దలకు కూడా తిను బండారాలను తన జోలె నుండి తీసి ఇచ్చేవాడని చెప్తారు. అసలు ఈ లాఫిం గ్ బుద్ద చేతిలోనిది బిక్షాపాత్ర కానే కాదని.. అక్షయ పాత్ర అని దాని ద్వారానే అనేక విధాలుగా అందరినీ ఈ బుద్ధుడు ఆదుకునేవాడని అప్పటి నుండి కోరిన కోర్కెలు తీర్చేవాడిగా పేరు సంపాదించుకోవ ట మే కాకుండా...ఎలాంటి కష్టమెచ్చినా నవ్వుతూ ఎదుర్కొనాలని ప్రచారంచేస్తూ..తానునిత్యం నవ్వు తూ కనిపించేవాడని..ఆక్రమంలోనే లాఫింగ్ బుద్ధ గా హొట్టో బహుళ ప్రచారం పొందాడని మరో కధనం ప్రచారంలో ఉంది. ఆపదలో ఆదు కునే ఈ బౌద్ద బిక్షువుని హ్యాపీ బుద్దగా బుదాయి, మైత్రేయి, కైసీ, ఇలా అనేక పేర్లతో బౌద్దులు పిలుస్తారు.
మైత్రేయి
తమ ఏడుగురు అదృష్ట దేవతలలో లాఫింగ్ బుద్ధ ఒకడని జపనీయులు నమ్ముతారు. సమ స్త మానవాళికి మంచి చేసేందుకు... ఈ భూమిపై పుట్టిన వ్య్యక్తిగా బుద్ధుడిని మైత్రేయిగా పేర్కొంటారు. మనదేశం లో పుట్టిన ఈ గౌతమ బుద్ధుడు గురించి రాసిన అనేక గ్రంధాలలో బుద్ధుడిని మైత్రేయిగా కూడా పేర్కొంటారు. బోధి సత్త్వూకుడిగా పేరున్న బుద్ధు ని సంస్కృతం రచన ల్లో మైత్రేయిగా పేర్కొ నటం గమనార్హ
మని... మైత్రేయి అంటే భవిష్య బుద్ధుడిగా కూడా కొందరు చరి త్రకారులు పేర్కొంటారు. ఈ భవిష్య బుద్దుడు యావత్ జనుల భవిష్యత్ ఆనంద సాగరంలో మునిగి తేలాలని కోరుకుం టాడని... అందువల్లే నిత్యం తాను నవ్వుతూ అందరి నీ నవ్విస్తూ ఉండే మైత్రేయి విగ్రహాన్ని ఇళ్లలో పెట్టుకుంటే సుఖశాంతులు, సిరి సంపదలు వర్ధిల్లుతాయని వారి నమ్మకం.
సంజకాయ్
ధాయ్‌లాండ్‌లో ప్రచారంలో ఉన్న కధ ఇది. మగాళ్లు సైతం మైమరిచి పోయేంత అందంతో ఉండే సంజకాయ్ అనే వ్యక్తిని ఆడ పిల్లగా ఉంటే ఈ పాటికి పెళ్లాడే వాళ్లమని ఆట పట్టిస్తూ ఉండే వాళ్లని... దీంతో ఆతను తన రూపాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుని శరీరాన్ని భారీగా మార్చుకున్నా డని అనంతర కాలంలో ఆతను బౌద్ధమత ప్రచారకుడిగా... ఆపై బౌద్ద్ధ బిక్షువుగా మారి చిరు నవ్వులు చిందిస్తూ... అందరికీ సాయమందిస్తూ.. బుద్ధుని కృపకు పాత్రుడై ఆతనిచ్చిన అక్షయ పాత్ర సాయంలో అందరి కష్టాలు తీర్చినట్లు ఈ కధ సారాంశం.
ఎక్కడ ఉంచాలి....
అయితే లాఫింగ్ బుద్ధని ఇష్టాను సారం ఎక్కడ పడితే అక్కడ పెట్ట కూడదని ఫెంగ్ షూయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆఫీసుల్లోను, వాణిజ్య ప్రాంతాలలో వీలైనంత వరకు రిసప్షన్‌లలోను, బిజినెస్ కౌంటర్లలో పెడితే ఫలితాలుంటాయి. అలాగే విద్యార్ధులు తాము చదువుకునే టేబుల్‌పై ఉంచితే విద్యాసమపార్జన బాగా జరుగుతుందని, ఇళ్లలో అయితే టివి రూం, కామన్ హాల్‌లలో వీటిని పెట్టాలి మినహా బాత్ రూంలలో, డైనింగ్ హాళ్లలో, డ్రస్సింగ్ రూంలలో పెట్టకూడదని... అలాగే ఈ విగ్రహాన్ని ఎట్టి పరిస్ధితిలోనూ కింద పెట్టవల్ల అనర్ధాలు జరిగే ప్రమాదం ఉందని... హెచ్చరిస్తున్నారు.
ఆఫీసులో, ఇళ్లలో ఎక్కడైనా సరే ద్వార బంధా నికి దగ్గర్లో, కానీ ఎదురుగా గానీ సరైన స్ధలాన్ని నిర్ణయించి భూమి కనీసం అడుగున్నర ఎత్తులొ నైనా ఉంచితే నిత్య సంతోషం అక్కడ తాండవి స్తుందని చెప్తారు.
రూపాలనేకం...
లాఫింగ్ బుద్ద వివిధ రూపాల్లో లభ్యమవు తున్నాయి. బౌల్‌ని ఆకాశం వైపు చూపిస్తూ అనం త సంపదను అందుకునే ఉండేదానిని... దయా మయ హృదయంతో చిరునవ్వులు చిందిస్తూ... ఉండే బొమ్మ ఉంచిన చోట సకల సంపదలు వస్తాయని... ఫెంగ్ షూయ్ నిపుణులు చెప్తారు. అలాగే కుండలోని బంగారు నాణాలతో... భుజం పై సంచీ వేసుకుని నవ్వుతూ కనిపించే లాఫింగ్ బుద్ధ ఓ బంగారు తిన్నెపై కూర్చొని.. ఏదో ప్రయాణానికి సిద్దమవుతున్న వాడిలా ఉంటాడ ని.. ఈ ప్రయాణం ఆధ్యాత్మికత వైపని.. ఆతని భుజంపై ఉండే గోతంలో ఉండే సకల భాండా గారం మనిషిలోని అంతర్గత భావాలకు... చేతి లోని విసన కర్ర అవగాహన కల్పించే ఆయుధ చిహ్నాలుగా పేర్కొంటారు. ఈ బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే సౌభాగ్యాలకు, సంతోషాలకు కొదివే ఉండదని... ఫెంగ్ షూయ్ నిపుణులు చెప్తారు.
ఏది ఏమైనా మన భారతావనితో సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ప్రజలు కోరిన కోర్కె లు తీర్చే ఇష్టదైవంగా లాఫింగ్ బుద్ధాని మార్చు కుంటున్నారన్నది వాస్త్తవం.
రోజూ ఇంట్లోంచి బైటకు వెళ్లే సమయంలో ఆతని పొట్టపై రాసి మొక్కుకుని వెళ్తే అనుకున్న కార్యం ఆనందంగా పూర్తవుతుందన్న నమ్మకం బహుళ ప్రచారంలో ఉంది. వీలైనంత పెద్దది కొనుక్కుని అలంకార వస్తువుగా కూడా దీరిని వాడవచ్చని మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు.