వీధిలోంచి ఇలా ఇంట్లోకి రాగానే హాయిగా కాసేపు రిలాక్స్ అవ్వాలని ఎవరికుండదు చెప్పండి... అందుకు ఎదురుగా కనిపించే సోఫానో...
దివాన్‌నో ఆశ్రయించి అందులోని కుషన్‌ని సరి చేసుకుని నడుం చేరేసే వాళ్లు కూచుకున్నంత సేపు ఏదో తెలియనిప్రశాంతత పొందుతూ...
ఈకుషన్‌లపై మక్కువ చూపుతున్నారు..
ఇంటిని అందంగా అలంకరిం చుకోవటం ఇల్లాలిగా బాధ్యతే అన్న విషయాన్ని గుర్తించే ఇంటిని చూసి... ఇల్లాలి మనస్ధ త్వం చెప్పొచ్చని చెప్పారు మన పెద్ద లు... ఇప్పుడు దాదాపు ధనిక, మధ్య తరగతి అన్న తారతమ్యాలు లేకుండా ఇంటిని అలంకరించుకునేందుకు ఎక్కు వ మంది శ్రద్ద చూపిస్తున్నారిప్పుడు.
మారుతున్న కాలానుగుణంగా... ఇంటిలో చిన్న చిన్న మొక్క లు, రకరకాల పువ్వులతో కూడిన ఫ్లవర్ వాజ్‌లు, పక్షుల కిలకి లలతో పంజరాలు, ఆహ్లాదకరంగా అటు ఇటు కదులుతూ... హొయలొలికించే అనేక రంగు రంగుల చేప పిల్లలతో ఉండే ఎక్వేరియంలు ఇలా అనేక హంగులు నేడు గృహా లంకరణలో నిత్యమౖైెపోయాయి.
ఈ క్రమంలో దివాన్ కాట్‌లు, రకరకాల సోఫాలు ఇంటికి కొత్తవన్నెలు తెచ్చే లా కొనుగోలు చేయటమూ కాకుండా వాటిని అందంగా అలంకరించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నా రిప్పుడు గృహిణులు.
ఇంటి అలంకరణ ఓ కళ అనే చెప్పక తప్పదు, టీపాయ్ మొదలు, టివి స్టాండ్ వరకు, కర్టెన్ మొదలు సోఫా కవర్ వరకు అన్నీ ఆహ్లాదం పరిచేలా ఉండాల్సిందే.. ఇందు కు ఖర్చుకు వెనక్కి తగ్గకుండా.. తమ శక్తి కొలది కొనుగోలు చేస్తూ... ఇంటిని అలంకరించు కుంటున్నారు అంతా.
ఇంటికి వచ్చే అతిధులు ఎక్కువసేపు ఉండే డ్రాయింగ్ రూంలపైనా బాగా శ్రద్ద వహిస్తున్నారు. వచ్చే వారే కాదు... తాము కూడా అలసి సొలసి వచ్చి ఇంట్లో కాసేపు టివి చూసేందుకు హాయిగా ఏ దివాన్ పైనో, సోఫా లోనో కూర్చొనేలా వాటికి తగ్గ ట్టుగా ఎన్నో కుషన్‌లను కొనుగోలు చేసి అనేక హంగులతో వాటికి కవర్లు కుట్టి స్తూ... కొత్త అందాలతో ఆకర్షించే ప్రయ త్నం చేస్తున్నారు.ఇక ఆఫీస్‌లలోనూ సోఫాల కుషన్‌లకు ప్రత్యేక అలకరణ తప్పని సరి అయ్యింది. వచ్చిపోయేవారు కాసే పైనా రిలాక్సయ్యే లా మెత్తని కుషన్‌ని గోడరంగులకు, కర్టెన్ల రంగు లకు తగ్గట్టుగా చూడముచ్చటి రంగుల్లో కవరు తొడుగుతున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో ఇబ్బడిముబ్బడిగా అనేక కుషన్ కవర్లు, డిజైన్లు లభ్యమవుతున్నాయి.ఆఫీసైనా,ఇంట్లో డ్రాయిం గ్ రూం అయినా... బాల్కనీలోనో... లాన్‌లో ప్రత్యేకంగా చేయించుకున్న ఊయల అయి నా... మెత్తని కుషన్లు ఎంతలా కోరు కుంటున్నారో... వాటికి కొత్త అందాలను సంతరించుకునే లా కవర్ డిజైన్లపైనా అంతే మక్కువ చూపిస్తున్నారు.
కూర్చున్న కాసేపైనా కుషన్‌లలో సేద తీరేందుకు వీలుగా ఇండి యన్ ఫర్నీచర్ కుషన్ కవర్, ప్యాచ్ వర్కు కుషన్ కవర్, డై కుష న్, పింటక్ కుషన్, చౌర్ కుషన్, ఇలా చాలా రకాలు కుషన్లు అందుబాటులో ఉండగా... కవర్లలో మనకి ఎక్కువగా ఎంబ్రయి డరీ కుషన్ కవర్, సిల్క్ కుషన్ కవర్, సోఫా కుషన్ కవర్, కాట న్ కుషన్ కవర్, , డెకోరేటివ్ కుషన్ కవర్, లెదర్ కుషన్ కవర్ లభ్యమవుతున్నాయి. దీనికి తోడు రాజస్ధాని సంప్రదాయ కళలను రంగరించినవి, తెలుగింటి విరిబోణి కళంకారీ అందాలు ప్రత్యేక అందాలిచ్చేందుకు పోటీ పడుతున్నాయనే చెప్పక తప్పదు.
ఎంబ్రయిడరీ కవర్లు...
ఒకప్పుడు సూదీ దారంలో ఇళ్లలోనే తల దిండుకు తొగిగే గలేబు లకు లతలూ, పూలు వేసి అందంగా అలంకరించే వారు. అయితే నేటి ఆధునిక యుగంలో కాలంతో పాటు పరుగులు తీయా ల్సిన అవసరం ఎక్కువగా ఉండటంతో ఎంబ్రయిడరీ పనివారలకు కాసింత పని కల్పించేందుకు ఈ కుషన్ కవర్లు బాగా ఉపయోగ పడుతున్నాయనే చెప్పక తప్పదు. సోఫా కవర్లు, దివాన్ కవర్లుకు ఎవరి అభిరుచికి తగ్గట్టు వారికి అనేక డిజైన్లను కుట్టి అందిస్తు న్నారు. ఈ పని ఒకప్పుడు కుటీర పరిశ్రమగా ఉన్నా... నేడు చాలా మేరకు అభివృధ్ది చెంది వందలాది మందికి ఉపాధి చూపించేలా పరిశ్రమగా వర్ధిల్లింది.పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, శోభనం ఇలా సందర్భానుసారంగా కూడా అనేక డిజైన్లను రూపొందించి కవర్ల ను అందిస్తున్నారు డిజైనర్లు... వీటికి మార్కెట్‌లో ప్రత్యేక గిరాకీ ఉంది. ముందుగా అర్డర్లిచ్చి కుట్టించుకునే వారు కూడా అధికంగా ఉన్నారని ఎంబ్రయిడరీ యూనిట్ ప్రతినిధులు చెప్పారు.
పాచ్ వర్కు డిజైన్లు..
అనేక రకాల రంగులతో మీ డ్రాయింగ్ రూమ్‌ని చూడగానే ఆహ్లాద కరంగా మార్చేసే డిజైన్లు ఇవి. తెల్లని క్లాత్‌పై ఫైన్ ఫ్యాబ్రిక్‌తో వీటిని రూపొందిస్తారు కనుక వెలిసి పోయే ఆస్కారం తక్కువగా ఉంటుం ది.అందువల్ల వీటిపై మక్కువ ప్రదర్శిస్తున్నారు. వివిధ కాంబినేషన్ల లో దొరికే ఈ పాచ్‌వర్కు కవర్లు తమ అభిరుచికి సరిగ్గా సరిపోతు న్నాయని పలువురు వినియోగదారులు చెప్పడం విశేషం.
సి ల్క్ కుషన్స్
కాసింత ఖరీదుగా కనిపించే ఈ కవర్లు మన్నిక లోనూబాగుంటాయి. అయితే ఇవి తక్కువ ధరలో దొరుకుతు న్నా... బోలెడు డబ్బు పోసి కొన్నారన్నపోజు మాత్రం కొట్టడం వీటి ప్రత్యేకత.
ఇవి నాణ్యమైన సిల్కుని సోఫా, దివాన్ కవర్లు కుట్టేందుకు వాడట మ కాకుండా వాటిపై ఫ్యాబ్రిక్‌తో అందాలకు వన్నె తెచ్చే డిజైన్లు రూపొంది స్తారు. బెడ్‌రూమ్‌లలో, లివింగ్ రూంలలో, ఇవి వాడుకుంటే... ఎక్కువగా మాసిపోవు. ఎక్కువకాలం మన్నుతాయి కూడా..ఈ సిల్క్ కుషన్లపై ఫ్యాబ్రిక్‌తో పాటు గా చిన్న చిన్న ఎంబ్రయిడరీలతో కూడి న కవర్లు కూడా ఇప్పుడు వస్తు ఆకర్షిస్తున్నాయి.
పింటక్ కుషన్
ఎదుటివారికి సైతం ఈర్ష్య పుట్టించేలా రూపొందే ఈ పింటక్ కుషన్సు ఎక్కువగా డైమండ్, సైవర్ ఆకారాల్లో లభ్యమవు తున్నాయి. వివిధ రకాల డిజైన్లలో, అనేక రంగుల్లో చూడ ముచ్చట గొలిపి క్లాసి కల్ లుక్‌తో ఉంటాయి.
లెదర్ డై కుషన్లు
కార్యాలయాలలో హుందాతనానికి ప్రతీ కగా ప్రత్యేకంగా రూపొందించ బడ్డ కవర్లు ఇవి. డై పద్దతిలో కొెబ్బ రి, స్పాంజ్ ఇలామెత్తని పదార్ధాల ను తనలో ఇముడ్చుకుని కుర్చీల ఆకారానికి తగ్గట్టు ఈ కవర్లను రూపొందిం చడం జరుగుతుంది. కంప్యూటర్ల పైన గంటల కొలదీ పనిచేసినా ఆఫీసుల్లో నిర్విరా మంగా మీటింగులు తదితర హడావిడి ఉన్నా కాసింత చేరబడితే చాలు. అన్నింటినీ మర్చిపోయే రిలాక్సు ఇచ్చే లా వీటిని తయారు చేసారు.
ఫాన్సీ కుషన్లు
రాజస్ధానీ అందాలు, గుజరాతీ సాంప్రదా య అల్లికలు, కుట్లు ఈ ఫ్యాన్సీ కుషన్లలో ఎక్కువగా కనిపిస్లాయి. పెళ్లిలలోనూ, సమావేశాలలోనూ.. పార్టీలకు వేసే ప్రత్యేక సోఫాలలోఎంతో ఆకర్షణీయంగా కని పించే... ఈ తరహా ఫ్యాన్సీ కుషన్ కవర్లను వాడు తున్నారు.
కుషన్ల తయారీలో ప్రత్యేక శిక్షణ
కుటీర పరిశ్రమకు ధీటుగా తయార వుతు న్న కుషన్ పరిశ్రమని మన రాష్ట్రంలోనూ ప్రోత్సహించేందుకు అనేక స్వచ్చంధ సంస్ధలు నడుంబిగిం చాయి.ఇప్పటికే కొబ్బరి పంట ఎక్కువగా పండే ఉభయగోదా వరి, విశాఖ, విజయనగరం, జిల్లా లతో పాటు కృష్ణ, గోదావరి నదీ పరి వాహ కాలలో శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి పీచుతో కుషన్ల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నా యి. అనేక స్వయం శక్తి సంఘాల ప్రతినిధులు కొబ్బరి పీచుతో కుషన్లు రూపొంది స్తుండ గా... మరి కొన్ని సంఘాలు వాటికి తగ్గ కవర్ల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఎంబ్రయిడరీ, లెదర్ తదితరాలతో కవర్లు రూపొందించి ఉపాధి పొందుతున్నారు అనేక మంది.