అయిదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా తెలంగాణ అంశంపై అధిష్టానం మే వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అయిన ఆయన తెలంగాణా అంశంపై నిర్ణయించాల్సింది పూరిగా కేంద్ర ప్రభుత్వమేనని... ఈ విషయం తెలిసి కూడా తెరాసతో కల్సి రాష్ట్ర ప్రభుత్వాని ఇబ్బంది పెట్టడం సరైనది కాదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమం బలంగా లేదని తాను నివేదిక పంపినట్లు కొందరు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని... తాను ఈ విషయమై ఎలాంటి నివేధికనీ అధిష్టానానికి ఇవ్వలేదని స్పష్టం చేసారు.దృష్ట్యా పార్టీ విప్‌ని ఎవరు ధిక్కరించినా కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని... ఎన్నికల నాటికి ప్రాంతాలకతీతంగా కాంగ్రెస్ శాసనసబ్యులంతా సభకు హాజరై కాంగ్రెస్ అభ్యర్ధులతో పాటు మిత్ర పక్షాల అభ్యర్ధులను కూడా గెలిపించుకోవాలిన బాధ్యత ఉందని సిఎం తెలంగాణా సభ్యులతో చెపారు. కాగా తెలంగాణా ఉద్యమాన్నివిస్పష్టంగా కేంద్రానికి వినిపించేందుకే తాము అసెంబ్లీని బాయ్‌కాట్ చేస్తున్నామని... ఎమెల్సీ ఎన్నికల్లో పాలొనే విషయమై తామంతా కల్సి ఓ నిర్ణయం తీసుకుంటామని శాసనసభ్యులు చెప్పినట్లు సమాచారం.