అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెడితే ఆయన పార్టీకి మద్దతుగా తాను ప్రచారం
నిర్వహిస్తాననిప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారే సోమవారం ప్రకటించారు. అవినీతిరహిత పార్టీగా అది ఉంటుందని,.
ఆ పార్టీకి ప్రచారం చేసినప్పటికీ తాను ఎప్పటికీ ఎన్నికలలో పోటీ మాత్రం
చేయనని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటమే తన ఉద్దేశ్యమన్నారు.
అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు.
అరవింద్ కేజ్రీవాల్‌తో, తన బృందంలో కూడా తనకు ఎవరితోనూ విభేదాలు లేవని అందరం కలిసి అవినీతిపై ఉద్యమిస్తున్నామన్నారు. తాను ఇప్పటి వరకు 70 మంది బ్యూరోక్రాట్లతో చర్చించానని, పలువురు మాజీ ఆర్మీ అధికారులను కలిశానని,నవంబరులో దేశవ్యాప్తంగా పర్యటిస్తానని హజారే చెప్పారు.